YS Sharmila: వెలుగొండ పూర్తి చేయకుండా ఇన్నాళ్లు గాడిదలు కాశారా? .. షర్మిల ఫైర్
ABN, Publish Date - Apr 22 , 2024 | 02:48 PM
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. పలు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేను ఏకిపారేశారు. ఎమ్మెల్యేగా ఉండి బాగా సంపాదించారని.. అన్నీ దోచేశారంటూ విరుచుకుపడ్డారు.
ఒంగోలు, ఏప్రిల్ 22: ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) దూకుడు పెంచారు. పలు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ (YSRCP) ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి జగన్‌పై (CM Jagan) తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేను ఏకిపారేశారు. ఎమ్మెల్యేగా ఉండి బాగా సంపాదించారని.. అన్నీ దోచేశారంటూ విరుచుకుపడ్డారు.
Aadhaar Card: ఫ్రీగా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకున్నారా.. లేదంటే మీకే నష్టం
చెత్తలకు ఓటేయడం అవసరమా?
‘‘ఎర్రగొండపాలెం ఎంఎల్ఏ బాగా సంపాదించాడు అంట కదా..! అన్ని కమీషన్ లు ఈయన వే అంట కదా..! మొత్తం దోచేశారు అంట కదా..! ఈయన మంచోడు అయితే ఇక్కడ నుంచి ఎందుకు మార్చారు? మన ఇంట్లో చెత్త ఉంటే అవతల వేస్తాం. ఈయన చెత్త అని వీళ్ళే ఒప్పుకున్నారు కదా..! ఇలాంటి చెత్తలకు, చెత్త పార్టీలకు ఓటు వేయడం అవసరమా? జగన్‌కుకి ఓటు వేస్తే ఈ నియోజక వర్గం బాగుపడుతుంది అనుకున్నారు. ఏం ఉద్దరించారు?’’ అంటూ విమర్శలు, ప్రశ్నలు కురిపించారు వైఎస్ షర్మిల.
Hanuman Jayanthi: రేపు హనుమాన్ శోభాయాత్రకు పూర్తైన ఏర్పాట్లు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
తట్టెడు మట్టి తీయలేదు...
వెలుగొండ ప్రాజెక్ట్ వైఎస్సార్ కట్టాలని అనుకున్న ప్రాజెక్ట్ అని.. 4.50లక్షల ఎకరాలకు సాగునీరు.. 15 లక్షల మందికి త్రాగునీరు అందించే ప్రాజెక్ట్ అని తెలిపారు. ప్రాజెక్ట్ 60 శాతం వైఎస్సార్ హయాంలో పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్‌పై జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును విమర్శ చేశారని.. అధికారంలో వచ్చాకా 6 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఐదేళ్లు అధికారం అనుభవించి తట్టెడు మట్టి తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగొండ పూర్తి చేయకుండా ఇన్నాళ్లు గాడిదలు కాశారా? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వీళ్లా వైఎస్సార్ వారసులు?
వైఎస్సార్ వారసులు వీళ్లా అని మండిపడ్డారు. సాగునీరు లేదు.. త్రాగునీరు లేదన్నారు. గుక్కెడు నీళ్ళ కోసం ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. సాగునీరు లేక నియోజకవర్గంలో వలసలు పోతున్నారని అన్నారు. అభివృద్ధి చేయలేని వీళ్ళు వైఎస్సార్ వారసులు కాదన్నారు. రైతులకు కనీసం డ్రిప్ ఇరిగేషన్ కూడా లేదన్నారు. వైఎస్సార్ హయాంలో రైతును రాజులా చూసుకున్నారన్నారు. వారసుడు జగన్ హయాంలో కనీసం పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేదని వ్యాఖ్యలు చేశారు. జాబ్ క్యాలెండర్ అని మోసం చేశారని.. 2.35లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు.
ఉద్యోగాల కోసం 54.25 లక్షల మంది నిరీక్షణ
దేనికి సిద్ధం...
ఒక్క హామీ నిలబెట్టకుండా ఇప్పుడు సిద్ధం అంటూ బయలుదేరారంటూ ఎద్దేవా చేశారు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నామన్నారు. ‘‘మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలు నెరవేర్చకుండా మోసం చేయడానికి సిద్ధమా? మద్యనిషేధం అని హామీ ఇచ్చి కల్తీ మద్యం అమ్మడానికి సిద్ధమా? రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేయడానికి సిద్ధమా? అటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలను వైసీపీ ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తోందన్నారు. ప్రజల శ్రేయస్సు అసలు పట్టదన్నారు. వైఎస్సార్ వారసులు అయితే ఇలాగేనా పాలన అని. ఇది వైఎస్సార్ పాలన కాదు. అంతా దోపిడీ పాలన, దొంగల పాలన. అంతా మాఫీయాల పాలన. వైసీపీ ది హత్యా రాజకీయాల పాలన.- న్నాన్నను పొట్టన పెట్టుకున్న వాళ్లకు మళ్ళీ సీట్ ఇచ్చారు.మళ్ళీ మళ్ళీ హత్యా రాజకీయాలు చేసే వాళ్లకు ఓటు వెయిద్దు. ఈ దొంగలకు, దోపిడీ దారులకు ఓటు వేయొద్దు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్ర అభివృద్ధి’’ అని ఏపీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
NDA Leaders: ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ దోపిడి... 50 వేల కోట్ల పైమాటే...
AP SSC Results: టెన్త్ పాసైన, ఫెయిల్ అయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 22 , 2024 | 03:15 PM