ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: మంత్రి కారుమూరికి రోజులు దగ్గర పడ్డాయి.. ఆరిమిల్లి రాధాకృష్ణ వార్నింగ్

ABN, Publish Date - Apr 30 , 2024 | 10:28 PM

మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన అనుచరులు ప్రజల భూములను కొట్టేశారని.. వారి భూమికి రక్షణ లేకుండా చేశారని తణుకు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ (Arimilli RadhaKrishna) సంచలన ఆరోపణలు చేశారు . మంత్రి కారుమూరి కారుకూతలు కుస్తూనే ఉన్నారని.. ఆయనను ఎవరూ పట్టించుకోరని చెప్పారు.

Arimilli RadhaKrishna

తణుకు: మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన అనుచరులు ప్రజల భూములను కొట్టేశారని.. వారి భూమికి రక్షణ లేకుండా చేశారని తణుకు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ (Arimilli RadhaKrishna) సంచలన ఆరోపణలు చేశారు . మంత్రి కారుమూరి కారుకూతలు కుస్తూనే ఉన్నారని.. ఆయనను ఎవరూ పట్టించుకోరని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించిన నియమాలు వైసీపీ ప్రభుత్వం ఏనాడైనా పాటించిందా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను జగన్ తెచ్చారని మండిపడ్డారు. ఈ చట్టంతో ప్రజలు చాలా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను వచించ్చే నల్ల చట్టం ఇదని ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.


AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!

తణుకు టీడీపీ కార్యాలయంలో ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలకు 1బీ, అడంగల్ లేకుండా జీరాక్స్ ఇస్తారా, ఇది చెత్త కాగితం కాదా అని నిలదీశారు. సామాన్యుల భూములు దోచుకుని, పట్టాదారు పాసు బుక్‌పై మీ ఫొటోలు ఎందుకు వేసుకుంటున్నారని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే ఈ జగన్ ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజల ఆస్తులను దోచుకోవడానికి వైసీపీ నేతలు పన్నాగం పన్నారని.. వైసీపీ అధికారంలో ఉండేది ఇంకా 13రోజులేనని స్పష్టం చేశారు.


Nampally CBI Court: మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు

‘‘మీరు చేసిన అరాచకాలకు, దోపిడీలకు శుభం కార్డు త్వరలో పడనుంది. మొన్న జగన్ గులక రాయి డ్రామా ఆడారు, రోజురోజుకూ స్టిక్కర్ సైజు పెంచారు. కారుమూరి.. నిన్నేవరూ లేపించనక్కరలేదు.. నీకు రోజులు దగ్గర పడ్డాయి. తణుకు ప్రజలు నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు చేసిన పాపాలే ఇంటికి పంపిస్తాయి. నువ్వు చేస్తున్న దగాకోరు తప్పిదాలను ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు.

Manifesto 2024: ఊహించని రీతిలో పెన్షన్ల పెంపు.. మేనిఫెస్టోలో కూటమి ప్రకటన

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 10:41 PM

Advertising
Advertising