AP Election 2024: సజ్జల అబద్ధాలు చెప్పడం మాని.. ఆ పని చేయాలి.. జీవీఎల్ ఫైర్
ABN, Publish Date - May 05 , 2024 | 10:01 PM
కేంద్రం పథకాలకు సొంత స్టిక్కర్లు వేసుకున్న చరిత్ర వైసీపీదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) ఆరోపించారు. మోదీ పథకాలకు మీ జగన్ పేర్లు పెట్టుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు చెబితే సజ్జల రామకృష్ణారెడ్డికు (Sajjala Ramakrishna Reddy) అంత ఉలుకెందుకని ప్రశ్నించారు.
విజయవాడ: కేంద్ర పథకాలకు సొంత స్టిక్కర్లు వేసుకున్న చరిత్ర వైసీపీదని బీజేపీ (BJP) ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) ఆరోపించారు. మోదీ పథకాలకు జగన్ పేర్లు పెట్టుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు ధర్మవరం సభలో చెబితే సజ్జల రామకృష్ణారెడ్డికు (Sajjala Ramakrishna Reddy) అంత ఉలుకెందుకని ప్రశ్నించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవినీతి జరగలేదని సజ్జల చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మద్యం, ఇసుక, మైనింగ్, భూమాఫియా రాజ్యం ఏపీలో నడిపింది మీరు కాదా అని ప్రశ్నించారు.
PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన
తెలుగు భాషను పూర్తిగా నిర్వీర్యం చేసి... మాతృభాషను తక్కువ చేసింది ఎవరని నిలదీశారు. జాతీయ విద్యా విధానానికి తూట్లు పొడిచింది మీరు కాదా అని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జిలు, పన్నుల భారాలు మోపింది మీరు కాదా అని నిలదీశారు. మద్యనిషేధం అన్న వ్యక్తి మద్యం విక్రయాల ద్వారా నిధులు సమకూర్చులోలేదా అని ప్రశ్నించారు. ఇవన్ని నగ్న సత్యాలే అయినా అడ్డగోలుగా అబద్ధాలు చెబుతారని ఫైర్ అయ్యారు.
పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు ఆపేశారని విరుచుకుపడ్డారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టులు మీ వారికి ఇచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు. రాజకీయ విమర్శలు చేస్తే వాస్తవాలు మరుగున పడవని అన్నారు. ఏపీలో ఏమాత్రం అభివృద్ధి జరిగినా.. అది కేంద్ర ప్రభుత్వం వల్ల జరిగిందేనని ఉద్ఘాటించారు. సజ్జల అబద్ధాలను చెప్పడం మాని... మీరు ఏం చేశారో చెప్పుకోవాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు హితవు పలికారు.
Sujana Choudary: వైసీపీ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!
Read Latest Andhra pradesh News or Telugu News
Updated Date - May 05 , 2024 | 10:17 PM