AP Elections 2024:కేంద్ర బలగాలకు సమాచారం లేకుండా లోకేష్‌ను ఎలా అరెస్ట్ చేస్తారు: దేవినేని ఉమ
ABN, Publish Date - May 18 , 2024 | 09:50 PM
నిన్న ఎయిర్ పోర్ట్‌లో అన్యాయంగా ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్‌ను అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni UMA) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై లోకేష్ అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిపై లోకేష్ తన అభిప్రాయాలు చెప్పారని అన్నారు.
విజయవాడ: నిన్న ఎయిర్ పోర్ట్‌లో అన్యాయంగా ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్‌ను అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni UMA) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై లోకేష్ అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిపై లోకేష్ తన అభిప్రాయాలు చెప్పారని అన్నారు. సోషల్ మీడియాలో జగన్ అవినీతిపై పోస్ట్‌లు పెట్టి ప్రశ్నించారని చెప్పారు.
20 మంది పోలీసులతో కొట్టి మరీ హింసలు పెట్టారని ధ్వజమెత్తారు.తీవ్రమైన దెబ్బలతో ఉన్నా లోకేష్‌ను ఆస్పత్రికి తరలించకుండా వ్యానులో తిప్పారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో పోలీసుల దుర్మార్గాలకు ఇదొక పరాకాష్ట చర్య అని అభివర్ణించారు. సీఎం సెక్యూరిటీ లోకేష్‌ను గుర్తించి పోలీసులకు అప్పగించారని చెప్పారు.లండన్ వెళ్తూ జగన్.. తన రాక్షసత్వాన్ని నిరూపించారన్నారు. దీనివెనుక. ఎవరు ఉన్నారు, ఎవరు చేశారో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
అతన్ని అదుపులోకి తీసుకోవాలంటే ముందు కేంద్ర బలగాలకు సమాచారం ఇవ్వాలని.. అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.ఎయిర్ పోర్ట్ అథారిటీకి సంబంధం లేకుండా లోకేష్‌ను ఎలా అరెస్టు చేశారని నిలదీశారు. బలవంతంగా కిడ్నాప్ చేసి అతని లైఫ్‌ను రిస్క్‌లో పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, సీఎస్ జవహార్ రెడ్డి స్పందించి లోకేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని అన్నారు. లేదంటే వారి ప్రమేయం ఉందని భావించి వారి పైనా కేసులు పెడతామని దేవినేని ఉమ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
Big Breaking: ఏపీలోని మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం
YS Jagan: వైఎస్ జగన్ లండన్ వెళ్తుండగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అసలేం జరిగింది..?
AP News: కడప కోర్టు ఉత్తర్వులపై.. సుప్రీంకోర్టులో షర్మిల పిటీషన్
Updated Date - May 18 , 2024 | 09:55 PM