AP Election 2024:ఎన్నికల సంఘానికి నాపై తప్పుడు ఫిర్యాదు చేశారు:కోమటి జయరామ్
ABN, Publish Date - Apr 25 , 2024 | 08:56 PM
ఎన్నికల సంఘానికి వైసీపీ (YSRCP) నేతలు తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి జయరామ్ అన్నారు. వైసీపీ నేత ఏ.ఎన్.ఎన్ మూర్తి ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుపై వివరణ ఇచ్చారు.
అమరావతి: ఎన్నికల సంఘానికి వైసీపీ (YSRCP) నేతలు తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి జయరామ్ అన్నారు. వైసీపీ నేత ఏ.ఎన్.ఎన్ మూర్తి ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుపై వివరణ ఇచ్చారు. గురువారం నాడు కోమటి జయరామ్ మీడియాతో మాట్లాడుతూ... మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ ఎన్ఆర్ఐ సానుభూతిపరుల మీటింగ్ రహస్యంగా నిర్వహించింది కాదని స్పష్టం చేశారు. ఈ సమావేశాన్ని యూట్యూబ్‌లో ప్రేక్షకుల కోసం ప్రసారం సైతం చేశామన్నారు. ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు టీడీపీ భావజాలం, పార్టీ కార్యక్రమాల ప్రచారం చేయాలని ఈ సమావేశంలో వక్తలు నిర్ణయించారని అన్నారు.
TDP: ఆ సమయంలో ఆస్తులు, స్థలాలపైనే జగన్ చూపు: పట్టాభి
ఇందులో భాగంగా రాష్ట్ర పర్యటనలు చేసే ఎన్ఆర్ఐ లు ఇతరుల నుంచి వనరులు సమీకరించకుండా సొంత వనరులు ఖర్చు చేసుకోవాలని కోరామన్నారు. 4 దశాబ్ధాల పాటు టీడీపీ పాలనలో అనేక కుటుంబాలకు జరిగిన మేలును ప్రచారం చేయడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమన్నారు. టీడీపీకి ఓటేస్తే రాబోయే తరాలకు మంచి జరుగుతుందని చెప్పాలని అనుకున్నామన్నారు. కానీ ఈ సమావేశంలో తాను చేసిన ప్రసంగాన్ని వక్రీకరిస్తూ తనపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు. నచ్చిన పార్టీకి ప్రచారం చేసుకోవడం ప్రాథమిక హక్కు అని తెలిపారు.
Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం సభ్యుడిగా తన సహచర ఎన్ఆర్ఐలను టీడీపీకి పనిచేసేలా అభ్యర్థించానని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో డబ్బులు ఇచ్చి తాను ప్రభావితం చేశానని వైసీపీ నేతలు చెప్పడం అవాస్తవమన్నారు. ప్రభుత్వ సలహాదారులపై తాము తప్పుడు వ్యాఖ్యలు చేశామంటూ వైసీపీ నాయకులు తమను బెదిరిస్తున్నారన్నారు. టీడీపీ ఎన్ఆర్ఐ సభ్యులుగా తాము మన దేశ చట్టాలను గౌరవిస్తామన్నారు. టీడీపీ ఎన్ఆర్ఐ సభ్యుడిగా తాను చాలా సంవత్సరాల పాటు పార్టీ కోసం పనిచేస్తున్నానని అన్నారు.
తాను గత ఆరు సాధారణ ఎన్నికల ప్రచారాల్లో సైతం పాల్గొన్నానని.. కానీ, ఎన్నికల నియమ నిబంధనలు ఎన్నడూ ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.తన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరించి ఫిర్యాదు చేశారని తెలిపారు. వాస్తవాలను పరిశీలించి ఉద్దేశపూర్వకంగా తనపై బురద జల్లాలని ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని కోమటి జయరామ్ కోరారు.
ఇవి కూడా చదవండి
AP Elections: ఒకేసారి ఆర్డీవో ఆఫీస్‌కు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు.. పరిస్థితి ఉద్రిక్తం
AP Elctions: ప్రశ్నించిన ప్రజలపై దాడులా?... కొడాలి అనుచరుల వీరంగంపై రాము ఫైర్
Read Latest Andhra Pradesh News And Telugu News
Updated Date - Apr 25 , 2024 | 09:10 PM