AP Elections 2024:అల్లు అర్జున్ కూడా ఆ విషయంపై ఆలోచించాలి: నట్టికుమార్
ABN, Publish Date - May 15 , 2024 | 06:11 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) అధికార వైసీపీ (YSRCP) మంత్రులు, క్యాబినేట్ అంతా ఓటమి చవి చూడనుందని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. అందుకే ఓటమి భయంతో దాడులు చేస్తున్నారని చెప్పారు.
అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) అధికార వైసీపీ (YSRCP) మంత్రులు, క్యాబినేట్ అంతా ఓటమి చవి చూడనుందని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. అందుకే ఓటమి భయంతో దాడులు చేస్తున్నారని చెప్పారు. ఏపీ ఎన్నికలు ముగిశాయని.. గెలుపు, ఓటములనేది అంచనాలే అని అన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలిసిన వాడిగా చెబుతున్నా.. కూటమి ఉత్తరాంధ్రలో భారీ మెజార్టీతో గెలవనుందని ధీమా వ్యక్తం చేశారు.
Pawan Kalyan: ఏపీలో రోడ్డు ప్రమాదాలపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి
వారికి శాశ్వతంగా రెస్ట్ వస్తుంది..
జన్మభూమి మీద అభిమానంతో 70 లక్షల మంది ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఇంతకుముందెప్పుడు ఇలా జరిగింది లేదని తెలిపారు. కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా మారి ఈ అల్లర్లకు సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడిన వారిందరికీ శాశ్వతంగా రెస్ట్ వస్తుందని అన్నారు. రెచ్చగొట్టే విధంగా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని..అవన్ని తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు..ఈ ఎన్నికల్లో అభివృద్ధి కావాలని ఓట్లేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
పవన్ సినిమాలు చేస్తారు...
‘‘పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి మెగా కుటుంబం, ప్రజల నుంచి 99 శాతం సపోర్ట్ ఉంది. ఎవరో ఒక కుటుంబ సభ్యుడు సపోర్ట్ చేయకపోనంత మాత్రానా ఏమి నష్టం లేదు. అది అతని విజ్ఞతకే వదిలేస్తున్నాం. మెగాస్టార్ ఓ మహా వృక్షం.. ఆయన వల్లే మెగా హీరోలు ఎదిగారు. ఎవరిష్టం వారిది.. అల్లు అర్జున్ కూడా అలానే సపోర్ట్ చేసుకున్నారు. సినిమాను సినిమాలానే చూడండి. కాబట్టి బన్నీని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. బన్నీ వెళ్లటం నాకు నచ్చకపోవటమనేది నా వ్యక్తిగత అభిప్రాయం.. బన్నీ కూడా ఆలోచించాలి.. మీ ఫొటోను వారి పార్టీకి అనుగుణంగా సోషల్ మీడియాలో తిప్పుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక.. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారు.. ప్రభుత్వ సుపరిపాలనలో మమేకం అవుతారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి కొత్త ప్రభుత్వం కృషి చేస్తుంది , యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించనుంది’’ అని నట్టికుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
AP News: పులివర్తి నానిపై జరిగిన దాడిని ఖండించిన గండి బాబ్జీ
KTR: రైతులను విస్మరించి రాజకీయాలపైనే సర్కార్ దృష్టి
Read Latest AP News And Telugu News
Updated Date - May 15 , 2024 | 06:27 PM