ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: వైసీపీలో నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నా: పృథ్వీరాజ్

ABN, Publish Date - Apr 28 , 2024 | 08:12 PM

వైసీపీ (YSRCP)లో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని జనసేన నేత, నటులు పృథ్వీరాజ్ (Prithviraj) అన్నారు.ఈ ఎన్నికల్లో జగన్‌ ఓడిపోవడం ఖాయమన్నారు. జగన్‌కి కాదు, కూటమికే రెండు బటన్లు నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.అసభ్యంగా మాట్లాడే మంత్రులు ఎన్నికలయ్యాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైసీపీ నేతలపై పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Prithviraj

విశాఖపట్నం: వైసీపీ (YSRCP)లో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని జనసేన నేత, నటులు పృథ్వీరాజ్ (Prithviraj) అన్నారు.ఈ ఎన్నికల్లో జగన్‌ ఓడిపోవడం ఖాయమన్నారు. జగన్‌కి కాదు, కూటమికే రెండు బటన్లు నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.అసభ్యంగా మాట్లాడే మంత్రులు ఎన్నికలయ్యాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైసీపీ నేతలపై పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవైపు సంక్షేమాలు ఇస్తూ.. మరోవైపు రేట్లు పెంచి జగన్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.


AP Elections 2024: ఏపీ రాజకీయాలపై జయప్రద ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ప్రచారంలో ముద్దులు పెడుతూ, టచ్‌లు చేస్తూ వెళ్తున్న జగన్‌ను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని సెటైర్లు గుప్పించారు. వైసీపీలో 10 సంవత్సరాలు ఉన్నానని ఆ పార్టీ సంగతి మొత్తం తనకు తెలుసునని అన్నారు. ఇంట్లో ఉన్న తన చెల్లెలు, అమ్మని సరిగా చూసుకోని జగన్ రాష్ట్రంలోని ఆడపడుచులను ఎలా చూస్తారని ప్రశ్నించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర చేసి పార్టీనీ నిలబట్టారని చెప్పారు. కానీ జగన్ వల్ల ఇప్పుడు షర్మిల పరిస్థితి ఎలా తయారయ్యిందో చూస్తున్నామని అన్నారు. షర్మిలకు జగన్ తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. జగన్‌కి ఉన్న 20శాతం ఓట్లు కూడా ఈ ఎన్నికల్లో షర్మిల, కాంగ్రెస్ పార్టీకే పడతాయని జోస్యం చెప్పారు.


AP Elections 2024: ఓటు ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు.. రండి ఇలా చెక్ చేసుకోండి!!

మంత్రి రోజాకి చాలా అహంకారమని.. అంత అహంకారం ఆడవాళ్లకి పనికిరాదని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో రోజాకి పతనం తప్పదని హెచ్చరించారు. పోతిన మహేష్‌కి రాత్రికి రాత్రి జగన్ నుంచి రూ. 5 కోట్లు వచ్చి ఉంటాయని.. అందుకే తెల్లారే సరికి పవన్‌నీ తిట్టడం మొదలుపెట్టారని మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడైన పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా మాట్లాడితే దాన్ని కూడా వైసీపీ నేతలు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి చేసిన వైసీపీ నాయకులు రాష్ట్రం నుంచి పారిపోవడం ఖాయమన్నారు. వైసీపీ మంత్రులని ఈ ఎన్నికల్లో తరిమి కొట్టడం ఖాయమని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

AP Elections: నీ అభిమానానికి ఫిదా.. చంద్రబాబు కోసం ఈయన ఏం చేశాడంటే..

Sharmila: సీఎం జగన్.. లాయర్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 28 , 2024 | 08:52 PM

Advertising
Advertising