ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: చిరంజీవి అలా చేయడమే మంచిది.. సజ్జల కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 21 , 2024 | 09:56 PM

సినీనటులు చిరంజీవి తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం మంచిదని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు.

కృష్ణా జిల్లా: సినీనటులు చిరంజీవి తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం మంచిదని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. ఆదివారం నాడు పెనమలూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చిందన్నారు. ఒక పక్క జగన్...మరో పక్క తోడేళ్లు, నక్కలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇలా స్పష్టంగా చిరంజీవి మాట్లాడటం మంచిదన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 150 సీట్లు రావడం ఖాయమన్నారు.

TDP: చంద్రబాబు నివాసానికి వచ్చిన గిడ్డి ఈశ్వరి, ఎంఎస్ రాజు, రఘురామ..


జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ అందుతున్నాయన్నారు. అజెండా లేకుండా, అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోరాట చేస్తున్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న చీకటి పాలన కావాలా, దేశానికే పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి పాలన కావాలా ఆలోచించుకోని ప్రజలు ఓటు వేయాలని కోరారు.

పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు జోగి రమేష్‌కు గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర పైన జగన్మోహన్ రెడ్డి ఒక వైపు, మిగతా పార్టీలు మరోక వైపు ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

AP Elections: వైసీపీ ఆశలు ఆవిరి.. ఆ నియోజకవర్గంలో వ్యూహం మార్చిన బీజేపీ..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 21 , 2024 | 10:12 PM

Advertising
Advertising