ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: చెల్లి చేసే ఆరోపణలు సాక్షిలో రాస్తే బాగుంటుందేమో!.. వసంత ఎద్దేవా

ABN, Publish Date - May 07 , 2024 | 04:58 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మైలవరం కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. - మంగళవారం తోలుకొడు, వెదురు బీడెం, కనిమెర్ల, పోరాటనగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంపై విరుచుకుపడ్డారు. ‘‘తన అడుగులకు మడుగులోత్తలేదని.. టిక్కెట్ ఇస్తా... ఖర్చులు మొత్తం నేనే భరిస్తా..

TDP Candidate Vasanta venkata krishna Prasad

ఎన్టీఆర్ జిల్లా, మే 7: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై (CM YS Jaganmohan Reddy) మైలవరం కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (TDP Candidate Vasanta Venkata krishna Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తోలుకొడు, వెదురు బీడెం, కనిమెర్ల, పోరాటనగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంపై విరుచుకుపడ్డారు.

AP Elections: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. పోలీసుల ఆగ్రహావేశాలు.. ఏం జరిగిందంటే?


‘‘టిక్కెట్ ఇస్తా.. ఖర్చులు మొత్తం నేనే భరిస్తా.. నా పార్టీ తరుపున పోటీ చేయాలని జగన్ ఒత్తిడి తెచ్చినా నేను పోటీ చేయలేదు. దీంతో తన సొంత పేపరు సాక్షిలో జగన్ ప్రతి రోజు నాపై ఎదో ఒక తప్పుడు కథనం రాయిస్తున్నారు. ఈరోజు ఇంకో అడుగు ముందుకు వేసి అనేక అవినీతి అక్రమాలు చేశానంటూ అసత్య కథనాలు వండి వార్చారు. మీరు అధికారంలోనే ఉన్నారు కదా. నేను గనుక అక్రమాలు, అవినీతికి పాల్పడి ఉంటే ఏ విచారణకైనా సిద్ధం?.. మీరు సిద్ధమా?’’ అంటూ వసంత సవాల్ విసిరారు.

AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!


చెల్లి చేసే ఆరోపణలు రాస్తే బాగుంటుంది...

దేవినేని ఉమకు తనకు గత కొంత కాలంగా రాజకీయ వైరం ఉందని, అది అందరికీ తెలిసిందేనని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. పార్టీ అధిష్టానం, అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) తీసుకున్న నిర్ణయం మేరకు తాను నడుచుకుంటున్నానని తెలిపారు. సాక్షి పత్రికలో తనపై ప్రతిరోజు రోజు వండి వార్చుతున్న తప్పడు కథనాలతో పాటు.. జగనన్న వదిలిన బాణం అని చెప్పుకుంటున్న షర్మిల (APCC Chief YS Sharmila) చేస్తున్న ఆరోపణల గురించి కూడా రాస్తే అప్పుడు ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారని ఎద్దేవా చేశారు.

వైఎస్ మరణానికి కారణం రిలయన్స్ సంస్థ అని, వైఎస్ వివేకానంద రెడ్డి మరణానికి కారణం చంద్రబాబు అని, తనపై సీబీఐ, ఈడీ తప్పుడు కేసులు పెట్టారని జగనన్న చెప్పాడంటూ చెల్లి షర్మిల ఒకనాడు ఉరూరా తిరిగి చెప్పారని గుర్తుచేశారని కృష్ణ ప్రసాద్ ప్రస్తావించారు. ఈరోజు అదే చెల్లెలు జగనన్న పచ్చి మోసగాడు, దొంగ, హత్యలు చేయిస్తాడు, అబద్దాలు చెబుతాడు, అంటూ గొంతెత్తి అరుస్తుంటే సాక్షి పత్రికలో ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. జగన్ ఇద్దరు వ్యక్తుల చేతిలో కీలుబొమ్మ అని షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు సాక్షిలో ఎందుకు రాయడం లేదని ఆయన నిలదీశారు.

PM Modi: విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో..?


రంగంలోకి లుంగీ బ్యాచ్..

జగన్‌కు కాదని వచ్చి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తున్న తనను ఓడించేందుకు ముఖ్యమంత్రి సారధ్యంలో ఇప్పటికే కడప, కర్నూలు నుంచి లుంగీ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళను దించారని వసంత కృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు. అలాగే ఇప్పటికే సమన్వయకర్తలుగా ముగ్గురిని నియమించిన జగన్ ఈరోజున లక్కిరెడ్డి వారి ఇంజనీరింగ్ కళాశాలలో సజ్జలను మైలవరం పంపి పెత్తందారులందరితో ఓ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. స్థానికంగా ఉన్న వైసీపీ వాళ్ళకు డబ్బులు, మందు ఇస్తే కాజేస్తారనే అలోచనతో వాళ్ళను పక్కన పెట్టి తమ వాళ్ళతో స్వయంగా డబ్బులు మందు పంపిణీ చేయడం కోసం ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు సజ్జల రూ.100 కోట్లతో మైలవరం వస్తున్నారని అన్నారు.

Election Commission: ‘రైతుభరోసా’ నిధుల పంపిణీపై ఈసీ ఆంక్షలు


మరోసారి అవకాశం...

తనని కాదని పోటీచేస్తున్న వసంత కృష్ణ ప్రసాద్‌ను ఎలాగైనా ఓడించడమే లక్ష్యంగా సజ్జల అండ్ కో టీమ్ రంగంలోకి దిగిందని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ‘‘వైసీపీ ఇచ్చే డబ్బలు తీసుకుని.. మీ కోసం నిరంతరం పనిచేస్తూ.. మీ కోసం, మీ వాడిగా, మీలో ఒకడిగా ఉంటూ మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరో గుర్తించి మీ మనసాక్షితో ఆలోచించి ఓటు వేసి మరోసారి మీకు సేవ చేసే అవకాశం కల్పించాలి’’ అని వసంత కృష్ణప్రసాద్ వినతి చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Elections 2024: చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో అండగా ఉంటాం: తన్జీమ్ ముస్లిం సంస్థ

LokSabha Elections: అఖిలేష్ యాదవ్ ప్రత్యేక పూజలు.. ఆలయాన్ని శుద్ది చేసిన బీజేపీ శ్రేణులు

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 05:33 PM

Advertising
Advertising