ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mla Pinneli: పిన్నెల్లికి దాసోహమన్న మాచర్ల పోలీసులు

ABN, Publish Date - May 22 , 2024 | 08:40 PM

మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. ఈవీఎం ధ్వంసం చేసి, అరాచకం సృష్టించిన పిన్నెలిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీని కలిసి మెమోరాండం అందజేశారు.

Pinnelli Ramakrishna Reddy

అమరావతి: మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. ఈవీఎం ధ్వంసం చేసి, అరాచకం సృష్టించిన పిన్నెలిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీని కలిసి మెమోరాండం అందజేశారు. పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో ఫుటేజ్‌ను డీజీపీకి సమర్పించారు. డీజీపీని కలిసిన వారిలో జూలకంటి బ్రహ్మారెడ్డి, వర్ల రామయ్య, దేవినేని ఉమా, పిన్నెల్లి చేతిలో దెబ్బలు తిన్న నంబూరి శేషగిరిరావు తదితరులు ఉన్నారు.


‘పిన్నెల్లి పై 307 కేసు నమోదు చేయాలి. పిన్నెల్లి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలి. సిఎస్ జవహర్ రెడ్డి వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొన్నాయి అని’ మాజీమంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.


‘రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో రిపోర్ట్ రూపొందించి డీజీపీకి అందజేశాం. మాచర్లను పిన్నెల్లి సొంత సామ్రాజ్యంగా తయారు చేసుకున్నాడు. మాచర్ల పోలీసులు పిన్నెల్లికి దాసోహం అంటున్నారు. మాచర్లలో ఉన్న వ్యవస్థలను పిన్నెల్లి మ్యానేజ్ చేస్తున్నాడు. తురకా కిషోర్‌తో పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేశారు. పెట్రోల్ బాంబ్, మారణాయుధాలు పట్టుకుని పిన్నెల్లి పోలింగ్ బూత్‌లోకి వచ్చాడు. మాచర్లలో పిన్నెల్లి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తాడిపత్రిలో పెద్దారెడ్డి తమ సొంత సామ్రాజ్యాల్లా మార్చుకుని ఏలుతున్నారు. కౌంటింగ్ రోజున బయట కనపడకుండా చర్యలు తీసుకోవాలి. కౌంటింగ్ జరగకుండా ఆపేందుకు కూడా ప్లాన్ చేస్తారు అని’ టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మర్డర్ కేసు పెట్టిస్తానని డీజీపీ హామీ ఇచ్చారని వివరించారు.


‘పోలింగ్ జరిగిన మరసటి రోజు, పథకం ప్రకారం పిన్నెల్లి దాడులు చేశారు. మాచర్లలో అరాచకం సృష్టించాలని నామినేషన్ రోజు నుంచి ప్రయత్నించారు. హత్యాయత్నం కేసులు పెట్టాల్సిన పోలీసులు నామమాత్ర కేసులు పెట్టారు అని’ జూలకంటి బ్రహ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు.


Read Latest AP News and Telugu News

Updated Date - May 22 , 2024 | 08:41 PM

Advertising
Advertising