AP Elections: కూటమి దూకుడు.. వైసీపీ బేజారు..!
ABN, Publish Date - Apr 08 , 2024 | 08:34 AM
ఎన్నికల యుద్ధంలో వైసీపీ వెనుకబడిపోతుందా. వైసీపీ వ్యూహాలు విఫలమవుతున్నాయా. జగనన్న పాచికలు పారడంలేదా అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల యుద్ధంలో వైసీపీ వెనుకబడిపోతుందా. వైసీపీ వ్యూహాలు విఫలమవుతున్నాయా. జగనన్న పాచికలు పారడంలేదా అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పొడవకుండా ఉండేందుకు వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రజలంతా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు చూస్తున్నారనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వ ఓటు చీలనివ్వబోనన్న పవన్ కళ్యాణ్ సంకల్పం ఓ వైపు ఫలించింది. జగన్‌ను గద్దె దించుతానన్న కూటమి సంకల్పం నెరవేరబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఎలాగైనా పొత్తును విచ్ఛినం చేయాలని ఎన్నో కుట్రలకు జగన్ తెరలేపినా కూడా.. ప్రజలు కూటమిని ఆదరిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.
YSRCP VS TDP: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. టీడీపీ నేతలపై దాడి
పవన్ టార్గెట్‌గా..
పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసి జనసైనికులను రెచ్చగొట్టడం ద్వారా పొత్తును విచ్చినం చేసేందుకు మొదట కుట్ర పన్నింది వైసీపీ. అయినా పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నామో పవన్ కళ్యాణ్ జనసైనికులకు అర్థమయ్యేలా చెప్పడంతో సీన్ మారిపోయింది. మరోవైపు టీడీపీలో సైతం నాయకులు అలకవీడారు. టికెట్ ఎవరికి వచ్చిందనేది కాదు.. కూటమిలో ఎవరూ పోటీ చేసినా గెలిపించి తీరుతామని మూడు పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. వరుసగా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకునేందుకు ఉమ్మడి సమావేశాలు నిర్వహించి.. మూడు పార్టీల నాయకులు ఒకే వేదికపైకి వచ్చారు.
మూడు పార్టీలు కలిసి..
ఎన్నికల సమరంలో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా పని చేస్తుండగా.. కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడంతో ఏపీ మూడ్ మారింది. మరోవైపు అవినీతి, అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పని చేస్తున్నారు. ఎటువంటి బేధాభిప్రాయాలు లేకుండా జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పని చేసుకుంటూ వెళ్తున్నారు.
సమన్వయ సమావేశాలతో..
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీల మధ్య సమన్వయం కోసం ఉమ్మడి సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో వ్యూహం రూపొందించారు. మూడు పార్టీల నాయకులు కలిసి ముందుకెళ్లాలని, ఎటువంటి బేధాభిప్రాయాలు లేకుండా, ఏ చిన్న సమస్య తలెత్తకుండా పని చేయాలని అధిష్టానం దిశా నిర్దేశం చేసింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం కొనసాగి స్తున్నారు. ఇటు కూటమి వ్యూహలకు వైసీపీ నాయకులు డీలా పడిపోతున్నారట.
Balasouri: మూడు రాజధానుల పేరుతో ఏపీని నాశనం చేసిన సీఎం జగన్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 08 , 2024 | 08:34 AM