ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024:వారిపై చర్యలు తీసుకుంటాం.. ఎన్నికల సంఘం వార్నింగ్

ABN, Publish Date - May 15 , 2024 | 03:19 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసినా తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపీ (YSRCP) అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ మూకలు పోలింగ్ రోజు(మే13) నుంచి భారీగా అల్లర్లు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పెద్దఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.

Election Commission

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసినా తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపీ (YSRCP) అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ మూకలు పోలింగ్ రోజు(మే13) నుంచి భారీగా అల్లర్లు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పెద్దఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.

దాడులను అడ్డుకోవటంలో పోలీసు యంత్రాగం పూర్తిగా విఫలం అయిందని మండిపడుతున్నారు. దీనికితోడు కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి ఇంకా కొంతమంది పోలీసులు వత్తాసు పలుకుతున్నారని.. వారి ఉదాసీన వైఖరీ వల్లే రాష్ట్రంలో అల్లర్లకు కారణమనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.


AP News: పులివర్తి నానిపై జరిగిన దాడిని ఖండించిన గండి బాబ్జీ

ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతేదీ..?

ఎన్నికల కమిషన్ (Election Commission) ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అధికార వైసీపీలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద వైసీపీ పెద్ద ఎత్తున అవకతవకలకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్లాన్‌లో భాగంగానే పల్నాడు జిల్లాలోని మాచర్ల, కారంపూడి, తిరుపతి, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, నరాసరావుపేటలో జరుగుతున్న ఘటనలే ఇందుకు ప్రత్యక్ష ఊదాహరణ. అయితే ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. పోలింగ్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావు పేటలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయని... దాడులకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఘటనలపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


Pawan Kalyan: ఏపీలో రోడ్డు ప్రమాదాలపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి

హౌస్ అరెస్టు చేయాలి..

సీఈఓ మీనా బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అల్లర్లకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ హరీశ్‌ కుమార్‌ని ఆదేశించారు. నాలుగు ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టాం...అదనపు బలగాలు పంపించామని సీఈఓ మీనా తెలిపారు. అభ్యర్థులు అందరినీ హౌస్ అరెస్టు చేయాలని అదేశాలిచ్చామని అన్నారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలని ఏపీ డీజీపీకు అదేశాలిచ్చారు. పలు జిల్లాల్లో జరిగిన ఘటనలు అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

AP Elections 2024: ఏపీలో 81.6 శాతం పోలింగ్: సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

AP Elections: అంతలోనే మాట మారింది..?

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2024 | 03:50 PM

Advertising
Advertising