ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: కేంద్ర బలగాలతో ఏపీ ఎన్నికలు నిర్వహించాలి: వర్ల రామయ్య

ABN, Publish Date - Apr 30 , 2024 | 10:07 PM

ఏపీలో వైసీపీ (YSRCP) నేతలు ప్రజలను, ప్రతిపక్షాలను భ్రయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. పుంగనూరు నియోజకవర్గం ఏపీలో లేదా అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం నడుపుతున్నారా అని ప్రశ్నించారు.

Varla Ramaiah

అమరావతి: ఏపీలో వైసీపీ (YSRCP) నేతలు ప్రజలను, ప్రతిపక్షాలను భ్రయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. పుంగనూరు నియోజకవర్గం ఏపీలో లేదా అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం నడుపుతున్నారా అని ప్రశ్నించారు. ఆ నియోజకవర్గంలో టీడీపీ ప్రచార రథాలను తగలబెట్టారని ధ్వజమెత్తారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్‌‌ను భయపెట్టారని మండిపడ్డారు.


AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!

అక్కడి పరిస్థితిపై ఏపీ డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి చేతులు ఎత్తేశారని.. సీఎస్ జవహర్ తన మాట అక్కడ వినరని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అక్కడ కానిస్టేబుల్ నుంచి పోలీస్ ఉన్నతాధికారుల వరకు కేంద్ర బలగాలు పెట్టీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అక్కడి డీఎస్పీ ఏం జరగలేదని.. కారుపై రెండు రాళ్లు వేశారని నిర్లక్ష్యంగా చెబుతున్నారని అన్నారు. మీడియాకు డీఎస్పీ బైట్ ఎమ్మెల్యే ఫోన్ నుంచి ఎలా వెళ్తోందని ప్రశ్నించారు. అక్కడి డీఎస్పీ వాష్‌రూమ్‌కు వెళ్లాలన్న పెద్దిరెడ్డి పర్మిషన్ తీసుకోవాలా అని నిలదీశారు.


Manifesto 2024: ఊహించని రీతిలో పెన్షన్ల పెంపు.. మేనిఫెస్టోలో కూటమి ప్రకటన

డీఎస్పీని సస్పెండ్ చేయాలని.. అతను ఆ ఉద్యోగానికి తగిన వారు కాదన్నారు. మరో డీఎస్పీ ఉన్నారని.. రాజ్‌భవన్‌లో పనిచేసే ఆయన తమ్ముడిని అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నారని చెప్పారు. వారికి అడ్డం తిరిగిన వారిపై కేసులు పెట్టి తన అధికారం మదంతో కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు ఆర్వోలు పిలిచి ఇస్తున్నారని చెప్పారు.ఆ గుర్తును జనసేనకు మినహా ఎవ్వరికీ ఇవ్వద్దని కోరారు. ఈ కేసు న్యాయస్థానంలో ఉన్నందున అక్కడ తేలాక నిర్ణయం తీసుకుంటామని వర్ల రామయ్య తెలిపారు.

Nampally CBI Court: మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 10:35 PM

Advertising
Advertising