ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: లిస్ట్‌లో ట్విస్ట్.. కడప ఎంపీ అభ్యర్థిని మారుస్తున్న వైసీపీ!

ABN, Publish Date - Apr 11 , 2024 | 01:59 PM

ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు వైసీపీ 175 అసెంబ్లీ, 24 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఆ తరువాత మరో లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించడంతో.. అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా కొన్ని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

YS Avinash reddy

ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు వైసీపీ 175 అసెంబ్లీ, 24 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఆ తరువాత మరో లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించడంతో.. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ (YSRCP) అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా కొన్ని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాలుగు నుంచి ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. ఎన్డీయే కూటమి నుంచి బలమైన అభ్యర్థులు ఉండటంతో.. ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు వారిని ఎదుర్కోవడం కష్టమని భావించి.. కొన్ని స్థానాల్లో క్యాండెట్లను మార్చాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. కడప ఎంపీ అభ్యర్థిని కూడా మారుస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అభ్యర్థుల ప్రకటనకు ముందే నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. దాదాపు వాళ్లే అభ్యర్థులుగా ఉంటారని జగన్ సంకేతాలిచ్చారు. దీంతో తమకు టికెట్ గ్యారంటీ అనుకున్నారు చాలామంది నేతలు. అయితే ఆ తర్వాత కో ఆర్డినేటర్లలో మార్పులు చేశారు. మార్చి16న ఇడుపులపాయలో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించారు. దీంతో టికెట్లు వచ్చిన నేతలు ప్రచారాన్ని ప్రారంభించారు. నామినేషన్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇంతలో సీఎం జగన్ బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.


కడప ఎంపీ అభ్యర్థి మార్పు!

కడప ఎంపీ అభ్యర్థిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి పోటీ చేస్తు్న్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి జగన్ సోదరి షర్మిల పోటీ చేస్తున్నారు. వివేకా హత్య కేసులో నిందితుడికి జగన్ టికెట్ ఇచ్చారంటూ షర్మిల ప్రచారం చేస్తున్నారు. మరోవైపు షర్మిల ఓట్లు చీల్చడం ద్వారా అవినాష్ రెడ్డి ఓడిపోతే సొంత జిల్లాలో జగన్ ప్రతిష్ట మసకబారుతుందనే ఉద్దేశంతో ఇక్కడ అభ్యర్థిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డి స్థానంలో అభిషేక్ రెడ్డి బరిలో దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల మార్పునకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం అభ్యర్థుల మార్పు అంటూ ఓ లిస్ట్ వైరల్ అవుతోంది.

మిగతా నియోజకవర్గాల్లో..

మైలవరం వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పెనమలూరు అభ్యర్థిగా జోగి రమేష్ ఉన్నారు. మైలవరంలో సర్నాల తిరుపతిరావుకు టికెట్ కేటాయించారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్‌కు తిరుపతిరావు గట్టిపోటీ ఇవ్వలేరనే ఉద్దేశంతో ఇక్కడ వైసీపీ అభ్యర్థిని మార్చవచ్చంటూ ప్రచారం జరగుతోంది. జోగి రమేష్‌ను మైలవరానికి పంపిస్తు్న్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా వైసీపీ ఇప్పటికే షేక్‌ ఆసిఫ్‌‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఆయన స్థానంలో జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్‌కు టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉన్న విడుదల రజనీని గుంటూరు ఎంపీగా పంపించి.. గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2024 | 03:45 PM

Advertising
Advertising