ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: జగన్ ఇంటికి అమరావతి రైతులు.. కారణమిదే..?

ABN, Publish Date - Jun 06 , 2024 | 05:22 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతి రైతులు, ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో రైతులు మళ్లీ అమరావతిని రాజధానిగా చేస్తారని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారాన్ని కూడా అమరావతిలోనే చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతి రైతులు, ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో రైతులు మళ్లీ అమరావతిని రాజధానిగా చేస్తారని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారాన్ని అమరావతిలోనే చేస్తారనే వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే.


రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, హైకోర్టు, తదితర ప్రభుత్వ కార్యాలయాల కోసం భారీ నిర్మాణాలను కూడా నిర్మించారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి విశాఖపట్నంను రాజధానిగా వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ప్రకటించారు. దీంతో రైతులు ఉద్యమ బాట పట్టారు. ఐదేళ్లుగా అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో అమరావతి రైతులు సంబురాలు చేసుకున్నారు.


గాంధీగిరి పద్ధతిలో...

నేడు(గురువారం) ఆపద్దర్మ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి అరటి పండ్లు, మామిడి కాయలు, స్వీట్లు తీసుకుని రాజధాని రైతులు వచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చామని రాజధాని రైతులు చెప్పారు. అనుమతి లేకుండా లోపలకు పంపించేది లేదని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందితో రాజధాని మహిళా రైతులు వాదనకు దిగారు.


తమను కష్టాలకు గురి చేసి, చివరికి ఓడిపోయిన తమకు మేలు చేశారని రాజధాని రైతులు చెప్పుకొచ్చారు. అందుకే ఆయనకు స్వీట్లు, అరటి పండ్లు, మామిడి పండ్లు ఇద్దామని వచ్చామని రైతులు పేర్కొన్నారు. సుమారు అరగంట సేపు జగన్ అపాయింట్మెంట్ కోసం రైతులు వేచి చూశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్పందన రాకపోవడంతో రాజధాని రైతులు గాంధీగిరి పద్ధతిలో ఆందోళన చేపట్టారు.


ఆయన చొరవ వల్లే ఉద్యమాలు.. అమరావతి రైతులు

ఈ సందర్భంగా ఏబీఎన్‌తో అమరావతి రైతులు మాట్లాడారు. సీఎంగా ఉండగా తమ గోడు వినలేదని ఎమ్మెల్యేగా అయినా వింటారని వచ్చామన్న రైతులు చెబుతున్నారు. కూటమి విజయానికి పరోక్షంగా సహకరించిన జగన్‌కు ధన్యవాదాలు చెబుదామని వచ్చామని రైతులు చెప్పారు.ఆయన చొరవ వల్లే ఉద్యమాలు చేయడం ఎలాగో నేర్చకున్నామని రైతులు అన్నారు.

ఇంట్లో ఉండి గరిటెలు తిప్పే తమకు జెండాలు పట్టకోని ఉద్యమాలు చేయడం నేర్పిన గనత మీదే నంటూ వ్యాఖ్యానించారు. పోలీసులు అనుమతించక పోవడంతో కనీసం మీరైనా అందించాలని రైతులు కోరారు. కుదరదని చెప్పడంతో అక్కడే పాదచారులకు రైతులు పంచిపెట్టారు.


మా ఉసురు తగిలి వైసీపీ సర్వనాశనం: మహిళా రైతు ఆలూరి శ్రీదేవి

‘‘అమరావతి రైతులను ఏడిపించావు ఆ ఉసురు తగిలి నీ పార్టీ సర్వనాశనం అయ్యింది. ఇకపై రాజకీయాల్లో నీ పార్టీ, నువ్వు ఉండవు. అంతా చేసి ఓడిపోయాక ఇప్పడు కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా...? ముఖ్యమంత్రిగా రాజధానిలో ఒక్క మహిళను అయినా పరామర్శిచారా...? నా వెంట్రుక కూడా పీకలేరు అన్నవు ఘోర పరాజాయాన్ని మూట కట్టుకున్నావు. ప్రతి పక్షనేతకు జెడ్ ప్లస్ సెక్యూరిటీతో రాజధానిలో దర్జాగా తిరిగితే ... నీవ్వు నెట్ ప్లస్ భద్రతలో తిరుగుతావు. మాకు ఉద్యమ స్పూర్తి నువ్వే జగన్ ... ఇంట్లో ఉండే మాకు స్వతంత్రంగా ఆలోచించేలా చేశావు. గరిట పట్టుకునే తమకు జెండా పట్టుకోవాడం నేర్పించావు. మూడు రాజధానులనే అజెండాతో ఎన్నికలకు వెళ్లిన నీకు 11 సీట్లు వచ్చాయి. ఇంతటితో ఆ వాదన ఓడిపోయింది’’ అని మహిళా రైతు ఆలూరి శ్రీదేవి తెలిపారు.


ఆ 11 మందితో ‘‘ఆడుదాం ఆంధ్ర’’లో క్రికెట్ ఆడుకోండి: మహిళా రైతు దుర్గ

కూటమికి ఇన్ని సీట్లు ఇప్పించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చామని అనంతవరం మహిళా రైతు దుర్గ తెలిపారు. సీఎం నుంచి ఎమ్మెల్యే అయ్యారు గనుకే జగన్‌ను కలవడానికి ఈరోజు వచ్చామన్నారు. ఆయనకు 11 సీట్లు వచ్చినందుకు అభినందనలు తెలియజేయాలని వచ్చామని చెప్పుకొచ్చారు. 151 సీట్లలో మద్యలో 5 పోయి 11 మాత్రమే మిగిలాయన్నారు. వారితో ‘‘ఆడుదాం ఆంధ్ర’’ అని క్రికెట్ ఆడుకోవచ్చని ఎద్దేవా చేశారు. స్వీట్లు , అరిటి పళ్లు, తమలపాకులు, బోకేలు, మామిడి పండ్లు జగన్ కోసం తీసుకొచ్చామని మహిళా రైతు దుర్గ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

YSRCP: వైసీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డులు.. నేతల పరేషాన్

AP Politics: ఓటమితో నిజం ఒప్పేసుకున్న బొత్స.. నిన్నటి వరకు ఓ మాట.. నేడు మరో మాట..

YS Jagan: రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది: వైఎస్ జగన్

Big Breaking: ఇక ఆ తప్పు అస్సలు చేయను.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 06 , 2024 | 06:05 PM

Advertising
Advertising