AP News: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..
ABN, Publish Date - Dec 16 , 2024 | 06:19 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఆసక్తికర భేటీ జరిగింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఆసక్తికర భేటీ జరిగింది. ఏపీ సచివాలయం(Secretariat)లో సీఎం, డిప్యూటీ సీఎం దాదాపు అరగంటపాటు సమావేశం అయ్యారు. ఇద్దరూ కలిసి ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జనసేన నేత కొణిదెల నాగబాబు(Nagababu)ను ఏపీ క్యాబినెట్(AP Cabinet)లోకి తీసుకోవడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Volunteers: మాట ఇచ్చి మోసం చేస్తారా.. వాలంటీర్ల ఆగ్రహం
మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ క్యాబినెట్‌లో బెర్తు కన్ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకోవాలనే అంశంపై తాజాగా ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యాక మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తారా అనే అంశంపై ప్రధానంగా చర్చ సాగినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
AP Highcourt: సజ్జల భార్గవ పిటిషన్.. మధ్యంతర ఉత్తర్వులు జారీ
సహకార సంఘాల ఎన్నికల్లో ఇదే విధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు నామినేటెడ్ పదవులపైనా చర్చించినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి జనసేన తరఫున మూడో జాబితాను చంద్రబాబుకు డిప్యూటీ సీఎం అందించినట్లు తెలుస్తోంది. ఇద్దరూ అరగంటపాటు కీలక అంశాలపై చర్చించిన అనంతరం సచివాలయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు. ఈ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు నేతృత్వంలో 43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Home Minister Anitha: వాటిని ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధం అవుతున్నాం: హోంమంత్రి అనిత..
CM Chandrababu: నేను అన్ని డెడ్‌లైన్లు పూర్తి చేశా.. కానీ విధి డెడ్‌లైన్ మార్చింది
Updated Date - Dec 16 , 2024 | 07:06 PM