ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: రాజధాని ప్రాంతంలో సీఎస్ సుడిగాలి పర్యటన

ABN, Publish Date - Jun 09 , 2024 | 05:35 PM

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ (Nirab Kumar Prasad) నేడు(ఆదివారం) సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈనెల 12 న కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Nirab Kumar Prasad

అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ (Nirab Kumar Prasad) నేడు(ఆదివారం) సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈనెల 12 న కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను సీఎస్ పరిశీలిస్తున్నారు. ముందుగా రాజధాని ప్రాంతానికి గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయుని పాలెంలోని సీఆర్డీఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు.

తర్వాత అఖిల భారత సర్వీసు అధికారుల నివాసం సముదాయ భవనాలను, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లు, ఏపీ ఎన్జీఓల నివాసం భవనాలు సముదాయాలను సీఎస్ పరిశీలించారు. అనంతరం హైకోర్టు అదనపు భవనాన్ని పరిశీలించారు. పర్యటనలో సీఎస్ తో పాటు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్, ఎస్ఈ తదితర ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఉన్నారు. క్లియరెన్స్, స్ట్రీట్ లైట్లు, క్లీనింగ్ పై వెంటనే దృష్టి పెట్టాలని సీఆర్డీఏ అధికారులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడారు.


సీఎం ఆదేశాలతో..

‘‘కాబోయే సీఎం చంద్రబాబు రివ్యూలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాజధానిలోని భవనాలు పరిశీలిస్తున్నాం. ముందుగా శంకుస్థాపన ప్రాంతం పరిశీలించి అక్కడ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాం.రాజధాని అమరావతి ప్రాంతంలో 34 చోట్ల 94 జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 25 పనులపై వెంటనే దృష్టి సారించాలని పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అఖిలభారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్, గ్రూప్ 4 ఎంప్లాయీస్ బిల్డింగ్‌లను సీఎస్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం కన్నా ముందే రాజధాని పనుల స్థితిగతులపై రిపోర్టు అందజేస్తాం. వెంటనే 25 చోట్ల పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతం, సీడ్ యాక్సిస్ రోడ్డు మిగిలి ఉన్న పనులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిలభారత సర్వీస్ అధికారుల క్వార్టర్లు తదితర పనులను వెంటనే ప్రారంభిస్తాం. పలు కార్యాలయాల్లో ఫైళ్లు మాయమవడం, కరెక్ట్ అవ్వడం లాంటివి జరుగుతాయని అనుమానాలు ఉన్నాయి. ఫిర్యాదులు రావడంతో సీఐడీ, సిట్ ఆఫీసు, మైన్స్ కార్యాలయం, బేవరేజెస్ కార్యాలయాలకు సీల్ వేశాం’’ అని ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 05:39 PM

Advertising
Advertising