ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: జగన్ ప్రభుత్వంలో భూ కబ్జాలు , విధ్వంసాలు పెరిగిపోయాయి.. మంత్రి బాల వీరాంజనేయస్వామి విసుర్లు

ABN, Publish Date - Oct 25 , 2024 | 09:34 PM

జగన్ ప్రభుత్వంలో భూ కబ్జాలు , విధ్వంసాలు, గంజాయి మత్తు పదార్థాలు బాగా పెరిగిపోయాయని.. కూటమి ప్రభుత్వం అన్నింటికీ అడ్డు కట్ట వేసిందని మంత్రి బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. తొలిసారిగా విశాఖపట్నంలో జిల్లా సమీక్ష సమావేశం ఇవాళ(శుక్రవారం) నిర్వహించామని తెలిపారు.

విశాఖపట్నం: జగన్ ప్రభుత్వంలో భూ కబ్జాలు , విధ్వంసాలు, గంజాయి మత్తు పదార్థాలు బాగా పెరిగిపోయాయని.. కూటమి ప్రభుత్వం అన్నింటికీ అడ్డు కట్ట వేసిందని మంత్రి బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. తొలిసారిగా విశాఖపట్నంలో జిల్లా సమీక్ష సమావేశం ఇవాళ(శుక్రవారం) నిర్వహించామని తెలిపారు. జిల్లా సమస్యలపై సమీక్ష నిర్వహించామని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్, మెట్రోపై ప్రత్యేక దృష్టి పెట్టామని పెండింగ్‌లో ఉన్న రాజీవ్ గృహకల్ప , నిర్మాణాలు పూర్తి చేస్తామని మాటిచ్చారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. సమస్యలు ఒక్కొక్కటిగా అన్ని పరిష్కరిస్తామని మంత్రి బాల వీరాంజనేయస్వామి చెప్పారు.


వైసీపీ ప్రభుత్వం ఇసుకను దోపీడీ చేసింది: మంత్రి నిమ్మల రామానాయుడు

తూర్పు గోదావరి: వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారం ఇసుకను దోపీడీ చేశారని జలవనరుల శాఖ మంత్రి జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కొవ్వూరు మండలంలోని ఇసుక రీచ్‌ల‌ను ఆకస్మికంగా మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ ఇవాళ(శుక్రవారం) తనిఖీ చేశారు. బోట్స్ మ్యాన్ సొసైటీ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలపై మంత్రి చర్చించారు.


ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ... ప్రకృతి సహజ సిద్ధమైన ఇసుకను ఉచితంగా వినియోగదారులకి అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వారం రోజుల్లో ఓపెన్ రిచ్‌లను అందుబాటులోకి తీసుకుని వస్తామని తెలిపారు. రూ. 30 నుంచి 40 వేల కోట్లు ఇసుకపై అక్రమ ఆదాయాన్ని జగన్ ప్రభుత్వం సమకూర్చుకుందని ఆరోపించారు. వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా ట్రాక్టర్లు, ఏళ్ల బండ్లపై ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని అన్నారు. బోట్స్ మ్యాన్ సొసైటీలకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు.


దాచేపల్లిలో డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి సత్యకుమార్

అమరావతి: పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా బాధితులను ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ పరామర్శించారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దాచేపల్లిలో పరిస్థితి, ప్రభుత్వ శాఖల పరంగా తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి మంత్రి సత్యకుమార్ తీసుకెళ్లారు. దాచేపల్లిలో సమస్య పరిష్కారం అయ్యేవరకు మున్సిపల్, హెల్త్ శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి సత్యకుమార్ తెలిపారు.

Updated Date - Oct 25 , 2024 | 09:37 PM