AP NEWS; సార్వత్రిక ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Feb 10 , 2024 | 10:28 PM
సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండే అన్ని రకాల బృందాల శిక్షణా కార్యక్రమాలను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) ఆదేశించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండే అన్ని రకాల బృందాల శిక్షణా కార్యక్రమాలను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) ఆదేశించారు. శనివారం నాడు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సీఈఓ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సమావవేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అన్ని బృందాల శిక్షణలు ఈ నెలకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల షెడ్యూలు అమల్లోకి రాగానే ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెర్వెలెన్స్ టీములు ఇతర టీమ్‌లు ఏర్పాటు కావాలని సూచించారు. ఆయా బృందాలు నిర్వహించాల్సిన విధులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పలువురు అధికారులను ఆర్.ఓ.లుగా, ఏ.ఆర్.ఓ.లుగా, ఇ.ఆర్.ఓ.లుగా, ఏ.ఇ.ఆర్.ఓ.లుగా అన్ని జిల్లాలో నియమిచ్చినట్లు చెప్పారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్లకు సౌకర్యాలు కల్పించే కేంద్రాలు, హోమ్ ఓటింగ్ బృందాలకు తగినంత మందినీ సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఈవీఎంలను తరలించే వాహనాలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెర్వెలెన్స్ టీములు, వీడియో వ్యూయింగ్ టీములు, ఇతర బృందాల వాహనాలకు జీపీఎస్ ఉండాలని కోరారు. కమ్యూనికేషన్ ప్లాన్ అమల్లో భాగంగా జిల్లా కేంద్రం నుంచి బ్లాక్ స్థాయి వరకు పటిష్ఠమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. సమస్యాత్మమైన పోలింగ్ స్టేషన్లు అన్నింటికీ తప్పని సరిగా మైక్రో అబ్జర్వర్లను నియమించాలని ఆదేశించారు. వెబ్ కాస్టింగ్‌తో పాటు మీడియోగ్రఫీ కవరేజ్‌ల్లో ఆయా పోలింగ్ కేంద్రాల పరిసరాలను కూడా చిత్రీకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు రకాల యాప్‌ల వినియోగాన్ని విస్తృస్థాయిలో పెంచేందుకు టెక్నాలజీ వినియోగ ప్రణాళికను పటిష్టంగా అమలు పర్చాలని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.