CM Chandrababu: రఘరామకు చిత్రహింసలు.. జగన్ పైశాచిక ఆనందం
ABN, Publish Date - Jul 25 , 2024 | 03:48 PM
వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామరాజును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) శాంతి భద్రతలపై శ్వేతప్రతం విడుదల చేస్తున్న తరుణంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామరాజును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) శాంతి భద్రతలపై శ్వేతప్రతం విడుదల చేస్తున్న తరుణంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. లాకప్‌లో చిత్రహింసలు పెడుతున్న వీడియోను చూసి నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూసి పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. రఘురామను సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా చేశారని ధ్వజమెత్తారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక తనపై 17 కేసులు పెట్టిందని తెలిపారు. ఈరోజు (గురువారం) అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేశారు. పోలీస్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం పూర్తిగా విధ్వంసం చేసిందని మండిపడ్డారు. బాబ్లీ కేసు తప్ప తనపై గతంలో ఎప్పుడూ కేసులు లేవని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై 7 కేసులు పెట్టారని గుర్తుచేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని విమర్శించారు. కక్ష సాధింపు చర్యలకు గతంలో పోలీసులు ఆయుధంగా మారారని, ప్రభుత్వంతో పోలీసులు కుమ్మక్కై నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు.
ALSO Read: CM Chandrababu: వారి పాలన చూశారు.. ఇప్పుడు దానికి భిన్నంగా చేసి చూపుతాం
వైసీపీతో విభేదిస్తే పోస్టింగ్‌లు ఉండవు
వైసీపీ నేతలతో విభేదిస్తే పోస్టింగ్‌లు ఉండవు.. వీఆర్‌లో ఉంచేవారని తెలిపారు. ఐదేళ్లపాటు వీఆర్‌లో ఉన్న అధికారులు కూడా ఉన్నారని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విపక్ష నేతలను అణచివేసే కుట్ర చేశారన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 60కి పైగా కేసులు పెట్టారని, పల్లా శ్రీనివాసరావు ఇంటిని కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందులలో పోటీ చేసిన రవీంద్రనాథ్‌ను జైల్లో పెట్టారన్నారు. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ.. ధూళిపాళ్ల నరేంద్రను జైలులో పెట్టారని చెప్పారు. ప్రభుత్వ అధికారులపై దాడుల నెపంతో కూన రవికుమార్‌పై కేసు పెట్టారని తెలిపారు.
మహిళలపై అసభ్యకర పోస్టులు
‘‘మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. ఫర్నీచర్ దుర్వినియోగం చేశారని దివంగత నేత కోడెల శివప్రసాదరావుపై 18 కేసులు పెట్టారు. అవమాన భారంతో బతకలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. నాటి సీఎం జగన్ ఇంట్లో ఇప్పటికి కూడా ప్రభుత్వ ఫర్నీచర్ ఉంది. వంగలపూడి అనితపై అట్రాసిటీ కేసు పెట్టారు. అయ్యన్న పాత్రుడుపై అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు పెట్టారు. అచ్చెన్నాయుడు ఆరోగ్యం సరిగా లేకున్నా 600 కి.మీ. వాహనంలో తిప్పారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
Chandrababu: శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
తప్పుడు రాజకీయాలు చేస్తే సహించం..
‘‘సంబంధం లేకపోయినా పేపర్ లీక్ అయిందని నారాయణపై కేసు పెట్టారు. న్యాయమూర్తుల పైనా ఫేక్ పోస్ట్‌లు పెట్టారు. టీడీపీ, జనసేన కార్యాలయాలపై దాడులు చేశారు. జై జగన్ అనలేదని తోట చంద్రయ్యను చంపారు. వైసీపీ ప్రభుత్వం అక్రమంగా జీవో1 తీసుకువచ్చింది. టీడీపీ నేతలపై 591 కేసులు పెట్టారు, 162 మందిని అరెస్ట్ చేశారు. మా కార్యకర్తలపై1969 కేసులు పెట్టారు, 2370 మందిని అరెస్ట్ చేశారు. జనసేన నేతలు, కార్యకర్తలపై 206 కేసులు పెట్టారు. సొంత చెల్లి షర్మిలపై కూడా 2 కేసులు నమోదు చేశారు. శాంతిభద్రతలు విఫలమయ్యాయని వైసీపీ నేతలు ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వర్తించడం మా బాధ్యత. తప్పుడు రాజకీయాలు చేస్తే సహించం’’ అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
Bhuvaneshwari: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై భువనమ్మ ఏం చెప్పారంటే?
Madanapalle Fire Accident: మదనపల్లి కేసులో కీలక ఆధారాలు లభ్యం
Read Latest AP News And Telangana News
Updated Date - Jul 25 , 2024 | 05:59 PM