ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ

ABN, Publish Date - Jul 16 , 2024 | 08:54 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. రాత్రికి అక్కడే బసచేయనున్నారు.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. రాత్రికి అక్కడే బసచేయనున్నారు. సీఎంతోపాటు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో చంద్రబాబుకు టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు , కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు , పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి 50 అశోక్ రోడ్డు నివాసానికి చేరుకున్నారు. ఈరోజు రాత్రి 9.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు.


ALSO Read: Nara Lokesh: గుడ్ న్యూస్.. లెక్చరర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్..!!

రేపు(బుధవారం) పలువురు కేంద్ర పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌లని కలవనున్నారు. ఇంకా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం అపాయింట్మెంట్లు ఖరారయ్యాయి. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక సాయం కోరనున్నట్టుగా జాతీయ మీడియా ప్రచారం చేస్తుంది. బీహార్ , ఏపీకి 23 వ తేదీన నిర్మల ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ప్రత్యేక సాయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. విభజన సమస్యల పరిష్కారం, ఇతర రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. ఏపీకి ప్రత్యేక సాయంపై మోదీ , అమిత్ షా , నిర్మలతో చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉందంటూ జాతీయ ఛానళ్ల కథనాలు ప్రసారం చేస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి హస్తిన బాట పట్టడంతోచంద్రబాబు పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: జోక్యం చేసుకోవద్దు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్

Ramprasadreddy: అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన

AP News: రండి సమస్యలు చెప్పుకోండి... టీడీపీ శ్రేణులకు ముఖ్య గమనిక

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 09:35 PM

Advertising
Advertising
<