CM Chandrababu: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Dec 31 , 2024 | 07:34 PM
CM Chandrababu:తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.
అమరావతి: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. 2024లో సంవత్సరంలో మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోందని చెప్పారు. కేవలం ఆరునెలల్లోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలను ఆవిష్కృతం చేశామని అన్నారు. పేదవాడి భవిష్యత్‌కు భరోసా ఇస్తూ పింఛన్ల మొత్తాన్ని పెంచామన్నారు. ప్రతి ఇంట కట్టెల పొయ్యి కష్టాలు తీరుస్తూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పారు. ధాన్యం సేకరణ డబ్బులు 48 గంటల్లో చెల్లించి రైతన్నలో సంతోషాన్ని నింపామన్నారు. మీ ప్రయాణం సాఫీగా సాగాలని రాష్ట్రంలో రహదారులన్నీ గుంతలు లేకుండా చేస్తున్నామని చెప్పారు. కొత్త ప్రభుత్వ పాలసీలతో మళ్లీ పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నాంది పలికామని అన్నారు. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోందని ఉద్ఘాటించారు. ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్ సాకారమే లక్ష్యంగా పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తూ అటు ప్రజా సంక్షేమాన్ని – ఇటు రాష్ట్రాభివృద్ధిని మీ అందరికీ సహకారంతో చేసి చూపిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
సీఎం చంద్రబాబును కలవటానికి.. అవి తేవద్దు: ఎమ్మెల్సీ అశోక్‌బాబు
సీఎం చంద్రబాబును కలవటానికి వచ్చే ముందు బొకేలు, పూలదండలు, కేక్‌లు, స్వీట్ బాక్సులు తేవద్దని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. చెట్లు నాటడం, పేదలకు భోజనాలు, విద్యార్థులకు పెన్నులు లాంటి బహుమతులు ఇవ్వాలని చెప్పారు. సేవా కార్యక్రమాలతోనే సీఎం చంద్రబాబు సంతృప్తి చెందుతారని అన్నారు.మానవ సేవ చంద్రబాబుకు ఎంతో ఇష్టమన్నారు. సీఎం చంద్రబాబును కలవటానికి వచ్చేవారు సంయమనం పాటించాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivasa Rao: మంత్రుల మార్పుపై.. పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్
AP High Court: పేర్నినానికి హైకోర్టులో స్వల్ప ఊరట
AP News: చిత్తూరు జడ్పీ సమావేశంలో రచ్చ రచ్చ
AP News: న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఏపీ మంత్రి.. కారణమిదే
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 31 , 2024 | 08:17 PM