ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: అది నా విధానం కాదు.. చంద్రబాబు హాట్ కామెంట్స్

ABN, Publish Date - Oct 18 , 2024 | 06:38 PM

తప్పు చేసిన వారిని చట్టబద్దంగా శిక్షిద్దామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు అరెస్టులు జరగాలి అంటే కుదరదని తేల్చిచెప్పారు. అది తనవిధానం కాదని... తాను చెడ్డపేరు తెచ్చుకునేందుకు మాత్రం సిద్ధంగా లేనని చెప్పారు. ఇసుక విషయంలో ఎవరు వేలు పెట్టవద్దని నేతలను హెచ్చరించారు....ఇసుక విషయంలో తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టంగా చెప్పానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu

అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే వల్ల పార్టీకి, తనకు చెడ్డపేరు వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో నేతలకు స్పష్టత ఉండాలని మందలించారు. పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలను గౌరవించాలని అన్నారు. ఈరోజు(శుక్రవారం) తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ఎంపీలు, ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాలని అన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు కేడర్‎ను పట్టించుకోవడం లేదని అన్నారు. కేడర్‎నీ నిర్లక్ష్యం చేస్తున్నారని.. తన దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. ఏ వ్యక్తి కూడా పార్టీ, కేడర్ లేకుండా గెలవలేరని ఎం చంద్రబాబు అన్నారు.


గతంలో నష్టం జరిగింది...

‘‘పార్టీ ఇచ్చిన విజయం మీది. పార్టీ వద్దు అనుకునే వారు ఇండిపెండెంట్‎గా గెలవాలి. పార్టీని రీస్ట్రక్చర్ చేసిన ప్రతిసారీ కార్యకర్తలు అర్థం చేసుకుని మద్దతుగా నిలిచారు. కార్యకర్తలు అధిష్ఠానం నిర్ణయాలకు మద్దతు పలికారు. పార్టీ ద్వారా గెలిచిన వారు పార్టీ సిద్దాంతాలు, నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలి. పొలిటికల్ గవర్నరెన్స్ అంటే ప్రజలకు చేసే మంచిలో మనం భాగస్వాములుగా ఉండటం. పార్టీని క్యారీ చేయాలి. ‎పబ్లిక్‎ను కన్విన్స్ చేయాలి. ఇది జరగకపోవడంతోనే గతంలో నష్టం జరిగింది. తప్పు చేసిన వారిని చట్టబద్దంగా శిక్షిద్దాం. ఇష్టం వచ్చినట్లు అరెస్టులు జరగాలి అంటే కుదరదు. అది నా విధానం కాదు. చెడ్డపేరు తెచ్చుకునేందుకు మాత్రం నేను సిద్ధంగా లేను. ఇసుక విషయంలో ఎవరు వేలు పెట్టవద్దు....ఇసుక విషయంలో తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టంగా చెప్పా. ఇసుక విధానం సక్రమంగా అమలు కాకపోతే అధికారులను కూడా బాధ్యులను చేస్తా. అధికారులు నిబంధనల అమల్లో కఠినంగా ఉండాలి’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే సహించను...

‘‘నేను ఇసుక విషయంలో ప్రజలకు హామీ ఇచ్చాను.. ఆ హామీని అమలు చేసి చూపాల్సిందే. ఎవరో ఒకరిద్దరి నేతల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే ఎందుకు సహించాలి. మద్యం విషయంలో కూడా ఎవరూ జోక్యం చేసుకోకండి. 2029లో మళ్లీ మీ అందరినీ గెలిపించుకోవాలని చూస్తున్నా.. మీ పనితీరు కూడా బాగుండాలి. మీ పనితీరుపై మళ్లీ త్వరలో ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం, ఫీడ్ బ్యాక్ తీసుకుంటా. ప్రజలనుంచి వస్తున్న వినతులను పరిష్కరించే విషయంలో ఎమ్మెల్యేలు శ్రద్ధ చూపాలి. ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంపై పర్యవేక్షణకు మంత్రులతో సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని పరిష్కరించే విధానం తీసుకువద్దాం. కేంద్ర ప్రభుత్వం ఏపీలో హైవేల నిర్మాణంపై లక్ష కోట్లు ఖర్చు పెట్టబోతోంది. అలాగే రైల్వేలో రూ. 75 వేల కోట్ల పనులు ఏపీలో జరగనున్నాయి. ఈ పనులు వేగంగా పూర్తి అయ్యేలా మనం కూడా సహకరించాలి. వీటిపై ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓనర్ షిప్ తీసుకుని పనిచేయాలి. అప్పుడు ప్రజల్లో మంచి పేరు వస్తుంది. ఆ ప్రాజెక్టులు వేగంగా పూర్తి అయ్యేలా దృష్టిపెట్టాలి. పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత తీసుకోవాలి. పట్టభద్రుల ఓట్లనమోదులో పార్టీ నేతలు పనిచేయాలి. ఓట్ల నమోదుకు ఇంకా 19 రోజుల సమయం మాత్రమే ఉంది.మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేలకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి. కూటమి నేతలతో కూడా సమన్వయం చేసుకోవాలి’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

AP News: భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ

Lokesh: ఆ ఖర్చును నా ఖాతాలో వేస్తారా: నారా లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 18 , 2024 | 06:53 PM