YS Jagan: గన్నవరంలో వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం
ABN, Publish Date - Jul 30 , 2024 | 04:52 PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి బెంగళూరు పర్యటన ముగించుకుని మంగళవారం నాడు ఏపీకి వచ్చారు. కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత (YCP Chief), మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Ex CM YS Jaganmohan Reddy), ఆయన సతీమణి భారతి బెంగళూరు పర్యటన (Banglore Tour) ముగించుకుని మంగళవారం నాడు ఏపీకి వచ్చారు. కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వైసీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు జగన్‌కు భారీ స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు.
Also Read: Minister Nimmala: వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి నిమ్మల
వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం..
అయితే, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో జగన్ కోసం వచ్చిన కార్యకర్తలు పోలీసులపై అత్యుత్సాహం ప్రదర్శించారు.జగన్ సెక్యూరిటీగా వచ్చిన గన్నవరం ఎస్‌ఐను తోసేశారు. ఎస్‌ఐ భుజం మీద చేయి వేసి జగన్ కార్యకర్తలు గొడవకు దిగారు. పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ సమక్షంలోనే ఈ తతంగం జరిగింది. పోలీసులపై దాడికి దిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు గన్నవరం పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను నెట్టి జగన్ కాన్వాయ్ వెంట వేరే కారులో వైసీపీ కార్యకర్తలు పరారయ్యారు.
Also Read: Excise Department: హోలో గ్రామ్ పేరిట భారీ స్కామ్.. వెలుగులోకి వైసీపీ ఆగడాలు
అయితే, వారం రోజులపాటు జగన్ బెంగళూరులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన బెంగళూరుకు వరుస పర్యటనల మర్మమేమిటనే చర్చ కూడా జరుగుతోంది. మొదట జగన్ బెంగళూరు వెళ్లే ముందు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ (Praja Durbar) నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. పార్టీ నాయకులు, ప్రజలను కలిసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. కానీ సడన్‌గా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని జగన్ బెంగళూరు వెళ్లారు.
తమను కలవకుండా బెంగళూరు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా జగన్ పాల్గొనలేదు. గత నెల 24న కూడా ఆయన సతీసమేతంగా బెంగళూరు వెళ్లారు. ఈ నెల 2న తిరిగి తాడేపల్లి ప్యాలెస్ చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం జగన్‌ను తీవ్ర నిరాశానిస్పృహలకు గురిచేసిందని.. ఓటమి బాధ నుంచి బయటపడలేకపోతున్నారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. సేద తీరేందుకు యలహంక వెళ్లారని చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Anitha: వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
AP News: గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిందన్న అధికారులు
GVL: రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎందుకు నష్టపోయిందంటే..: జీవీఎల్
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 30 , 2024 | 06:30 PM