ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Anagani: ఆ 11సీట్లు కూడా ఎందుకు ఇచ్చామని ప్రజలు బాధపడుతున్నారు..

ABN, Publish Date - Sep 11 , 2024 | 03:02 PM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూసి ప్రజలు బాధపడుతున్నారని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 11సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని ప్రజలు బాధపడే పరిస్థితిని ఆయన కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూసి ప్రజలు బాధపడుతున్నారని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 11సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని ప్రజలు బాధపడే పరిస్థితిని ఆయన కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌కు ప్రతి విషయంలో అసత్యాలు చెప్పడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతుంటే కష్టపడి పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, సీఎం చంద్రబాబుపై ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆయన తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసత్యాలతో జీవిస్తున్నారని ప్రతిరోజూ నిరూపించుకుంటూనే ఉన్నారని విమర్శించారు.


ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ.. "భారతదేశంలో సీఎంగా పని చేసిన వ్యక్తి ఎవ్వరూ ఇప్పటివరకూ ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పలేదు. బురద రాజకీయాలు చేయలేదు. బుడమేరు ఎక్కడ ఉంది.. డైవర్షన్ కెనాల్, రెగ్యులేటర్ ఎక్కడ ఉన్నాయి.. గండ్లు ఎప్పుడు, ఎక్కడ పడ్డాయి, కృష్ణానదీ ప్రవాహాలు ఎలా వచ్చాయనే అంశాలపై కనీస అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారు. మొన్నంటే తెలియక ఏదోదే అన్నారనుకుంటే.. ఇప్పుడు మళ్లీ అదే రాగం తీస్తున్నారు. జగన్ ఒక అబద్ధాన్ని పట్టుకుని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.


వరదల అంశాన్ని మళ్లించేందుకే వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నా. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిని సమర్థించుకున్న నీచమైన వ్యక్తి ఒక మాజీ సీఎం అని చెప్పడానికి బాధేస్తోంది. జనం కష్టాల్లో ఉంటే జైలుకు వెళ్లి క్రిమినల్‌ను పరామర్శించే జగన్‌కు మమ్మల్ని ప్రశ్నించే హక్కులేదు. పంటలు మునిగి ప్రజలు కష్టాల్లో ఉంటే పంటలు దగ్ధం చేసిన చరిత్ర కలిగిన వ్యక్తి వద్దకు వెళ్లి పరామర్శించడం జగన్‌కు మాత్రమే చెల్లింది. 6లక్షల మంది వరదల్లో చిక్కుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన పాపాలే కారణం. ఇలాంటి దారుణ పరిస్థితులు కల్పించిన జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి" అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జైలు బయట మాజీ సీఎం జగన్ సెల్ఫీలు..

వాటర్ ట్యాంక్‌పై వినాయకుడు.. ఐడియా అదిరింది..

కేంద్ర ఆర్థిక సంఘంతో రేవంత్ రెడ్డి బృందం భేటీ.. (ఫోటో గ్యాలరీ)

గోదావరి మహోగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక..

అందుకే తేజస్వీతో సీఎం నితీశ్ భేటీ...

Read LatestAP NewsandTelugu News

Read LatestTelangana NewsandNational News

Read LatestChitrajyothy NewsandSports News

Updated Date - Sep 11 , 2024 | 03:53 PM

Advertising
Advertising