AP Politics: వలంటీర్లపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Jun 16 , 2024 | 09:16 PM
వైసీపీ నేతలు బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి (Minister Bala Veeranjaneya Swamy) తెలిపారు.వారి నుంచి పెద్దఎత్తులో వస్తున్న మెయిల్స్, వాట్సప్ మెసేజ్‌లతో తన ఫోన్ నిండి పోయిందని చెప్పారు.
ప్రకాశం: వైసీపీ నేతలు బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి (Minister Bala Veeranjaneya Swamy) తెలిపారు.వారి నుంచి పెద్దఎత్తులో వస్తున్న మెయిల్స్, వాట్సప్ మెసేజ్‌లతో తన ఫోన్ నిండి పోయిందని చెప్పారు. రాజీనామా చేయకుండా ఉన్న వలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఒకటో తేదీనే ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేస్తామని మాటిచ్చారు. తన కార్యాలయంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈరోజు(ఆదివారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించారని చెప్పారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంస్కరణలు ప్రకటించారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవడం ఒక వరంగా భావిస్తున్నానని అన్నారు. మాది విడతల వారి ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఉద్ఘాటించారు. వెలుగొండ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మూతపడిన పాఠశాలలు తిరిగి తెరిపిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి హామీ ఇచ్చారు.
Updated Date - Jun 16 , 2024 | 09:16 PM