ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Mandipalli : ఐదేళ్లు జగన్ టెర్రరిస్ట్‌లా ఏపీని పాలించారు.. మంత్రి మండిపల్లి విసుర్లు

ABN, Publish Date - Sep 09 , 2024 | 05:38 PM

వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ.. ఈ రోజును బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మాజీ సీఎం జగన్ రెడ్డి ఒక టెర్రరిస్ట్‌లా గత ఐదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించారని విమర్శలు చేశారు.

Minister Mandipalli Ramprasad Reddy

అమరావతి: వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ.. ఈ రోజును బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మాజీ సీఎం జగన్ రెడ్డి ఒక టెర్రరిస్ట్‌లా గత ఐదేళ్లు ఏపీని పరిపాలించారని విమర్శలు చేశారు. జగన్ రెడ్డి పాలనలో ఎవరికీ నిద్రలేదని ఆరోపించారు. సీఎం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లుగా వ్యవహరించారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శలు చేశారు.


ALSO READ:Heavy Rains: భారీ వర్షాలు.. బొర్రా గుహలు మూసివేత

అక్రమంగా చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని అన్నారు. రూ.3000 వేల కోట్ల మోసం అంటూ.. 30 పైసలు కూడా బయట పెట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మాన ప్రాణాలనైనా తీస్తారని ఆరోపించారు. నాడు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని చట్టాన్ని చుట్టంలా వాడుకున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శలు చేశారు.


ALSO READ: Heavy Rains: భారీ వర్షాలు.. బొర్రా గుహలు మూసివేత

నేడు పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు బెంగళూరులో కూర్చుని జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వరదబాధితులకు సాయం చేయకపోగా.. పిచ్చి ప్రేళాపనలు పేలుతున్నారని విమర్శించారు. చంద్రబాబు చొరవతోనే విరాళాలు ఇవ్వడానికి పలువురు ముందుకు వస్తున్నారని వివరించారు. భారీ వర్షాల సమయంలో యంత్రాంగం చురుగ్గా పనిచేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రశంసించారు.


ALSO READ: Sam Pitroda: రాహుల్ పప్పు కాదు.. ఆయనలో క్వాలిటీస్ చెప్పిన శామ్ పిట్రోడా

కేంద్రమంత్రులు సైతం వచ్చి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, బాధితులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెబుతున్నారని అన్నారు. అబద్దాలను నమ్ముకున్న వైసీపీకి భవిష్యత్ లేదని ఆక్షేపించారు. వైసీపీలో ఆ 11 సీట్లు కూడా పోయి జగన్ ఒక్కడే ఆ పార్టీలో మిగలడం ఖాయమని ఎద్దేవా చేశారు, చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని.. తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Minister Ram Mohan: పౌర విమానయాన రంగం అభివృద్ధిపై మంత్రి రామ్మోహన్ కీలక నిర్ణయాలు

CM Chandrababu: ప్రజల కోసమే నా జీవితం అంకితం

AP Rains: అంతిమయాత్రకు తప్పని వరద కష్టాలు

Hyderabad: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు..

Read LatestAP NewsAnd

Updated Date - Sep 09 , 2024 | 07:14 PM

Advertising
Advertising