Minister Ramanaidu: జగన్ పాలనలో ఏపీకి ఎక్కువ నష్టం
ABN, Publish Date - Sep 29 , 2024 | 03:39 PM
రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్ల ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2014-19 ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లా: రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్ల ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2014-19 ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఇవాళ(ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లాలో టిడ్కో ఇళ్లను మంత్రులు నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ...పేదల కల నెరవేరాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో రంగులు వేశారు..
టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను పూర్తి చేయకుండా.. వైసీపీ ప్రభుత్వంలో ఆ ఇళ్లకు రంగులు వేశారని విమర్శించారు. ఐదేళ్ల పాటు జగన్ పాలనలో ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశామని అన్నారు. టిడ్కో ఇళ్లకు పూర్వ వైభవం తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఇళ్ల లబ్ధిదారులను బలవంతంగా రుణగ్రస్తులను చేశారని చెప్పారు. పది శాతం పెండింగ్ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అతి త్వరలో ఇళ్లను అందజేస్తామని తెలిపారు. ఒక్క పాలకొల్లులోనే రూ.150 కోట్లు ఇళ్లను తాకట్టుపెట్టి ఆ నిధులను మాజీ సీఎం జగన్ పక్క దారి పట్టించారని విమర్శించారు. ప్రపంచ స్థాయిలో మళ్లీ అమరావతిని తిరిగి నిలబెట్టేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
9 లక్షల గృహాలు మంజూరు చేశాం: మంత్రి నారాయణ
పశ్చిమగోదావరి జిల్లా: ప్రపంచ దేశాల్లోని ఆయిదు ఉత్తమ రాజధానుల్లో అమరావతిని నిలపలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2014లో టీడీపీ హయాంలో 9 లక్షల గృహాలు మంజూరు చేశామని... ఇది దేశంలోనే రికార్డు అని తెలిపారు. టిడ్కో గృహాలను నిర్మించిన కాంట్రాక్టర్లకు జగనన్న ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని అన్నారు.
బిల్లుల కోసం తిరుగుతున్నా కాంట్రాక్టర్లు ..
ఆ కాంట్రాక్టర్లు ఇప్పుడు బిల్లుల కోసం తిరుగుతున్నారని చెప్పారు. టిడ్కో గృహాల సముదాయంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రోజుకు రెండు లక్షలకు పైగా ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ వద్ద పేదలు భోజనం చేస్తున్నారని చెప్పారు. అన్న క్యాంటీన్లను జగన్ ఎందుకు మూసివేశారో సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని.. సీఎం చంద్రబాబు తన చాకచక్యంతో సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
TG Venkatesh: సిట్ ఏర్పాటుపై టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్..
PM Modi:మోదీ ఎమోషనల్.. తెలుగు వ్యక్తిపై ప్రశంసలు..
Somireddy: జగన్‌పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Read Latest AP News and Telugu News
Updated Date - Sep 29 , 2024 | 03:43 PM