Minister Sathya Kumar: వరద బాధితుల వైద్య సేవలపై మంత్రి సత్యకుమార్ ఆరా
ABN, Publish Date - Sep 08 , 2024 | 04:19 PM
వరద బాధితులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆరా తీశారు. వరద ముంపు ప్రాంతాలైన ప్రజాశక్తి నగర్ , ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని ఉచిత వైద్య శిబిరాలు, 104 సంచార వాహనాలను మంత్రి సత్యకుమార్ ఈరోజు(ఆదివారం) సందర్శించారు.
అమరావతి: వరద బాధితులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆరా తీశారు. వరద ముంపు ప్రాంతాలైన ప్రజాశక్తి నగర్ , ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని ఉచిత వైద్య శిబిరాలు, 104 సంచార వాహనాలను మంత్రి సత్యకుమార్ ఈరోజు(ఆదివారం) సందర్శించారు. క్యాంపుల్లోని వైద్యులకు మంత్రి సత్యకుమార్ కీలక సూచనలు చేశారు.
స్థానికంగా ప్రజలను కలుసుకుని అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ... కాచి చల్లార్చి వడబోసిన నీటినే బాధితులు తాగాలని సూచించారు. వైద్య శిబిరాలకు వచ్చిన వారికి అత్యవసర మందుల కిట్లను పంపిణీ చేశారు. గాయాలతో వైద్య శిబిరాలకు వచ్చే వారికి టీటీ ఇంజక్షన్లను కూడా అందుబాటులోకి తేవాలని ఉన్నతాధికారులకు మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ శిబిరాల ద్వారా అందుతున్న వైద్య సేవలపై బాధితులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి సత్యకుమార్ పరిశీలించారు. తన సొంత నియోజకవర్గం ధర్మవరం నుంచి స్పందన ఆస్పత్రి ఎం.డీ డాక్టర్ బషీర్ తీసుకు వచ్చిన 3వేల దుప్పట్లను వరద బాధితులకు మంత్రి సత్యకుమార్ పంపిణీ చేశారు. సామాజిక బాధ్యతగా పలు సంస్థల యాజమాన్యాలు బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి: ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో పెరుగుతున్న వరద దృష్ట్యా అధికార యంత్రాంగాన్ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అప్రమత్తం చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 3. 4 లక్షల క్యూసెక్కులు దాటి వరద నీరు ప్రవహిస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌కి అధికారులు తెలిపారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పునరావస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సహాయక చర్యల్లో వేగం పెంచాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. టెన్షన్.. టెన్షన్
Minister Nimmala: మంత్రి నిమ్మలను అభినందించిన సీఎం చంద్రబాబు..
Rain Alert: ఆ మూడు జిల్లాలను వణికిస్తున్న వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్లు..
Student Murder: అనంతపురం జిల్లాలో డిగ్రీ విద్యార్థిని హత్య కలకలం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Sep 08 , 2024 | 04:33 PM