ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: సంచలనం సృష్టిస్తున్నవైసీపీ కొత్త స్కాం

ABN, Publish Date - Nov 18 , 2024 | 12:15 PM

ఏపీలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాం పై అసెంబ్లీలో చర్చ జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ అరబిందో సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. 108 సేవ ముసుగులో భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.

అమరావతి: అరబిందో సంస్థ 2020 నుంచి ఏపీలో 108 సేవ ముసుగులో భారీ దోపిడీకి పాల్పడిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. కాలింగ్ అటెన్షన్ కింద రూల్ 74కింద 108 సేవలపై ఎమ్మల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ నరేంద్రలు సమాచారం అడిగారు. వందలాది కోట్ల రూపాయలు దోచుకొని సకాలంలో రోగులను ఆస్పత్రులకు చేర్చలేక పోయిందని విమర్శించారు. 2005లో ఈఎంఆర్ఐ సర్వీసులను108 ప్రారంభించిందని గుర్తుచేశారు. 2016లో ఒక్కో అంబులెన్స్‌కు లక్షా 30వేల రూపాయల కింద 436 అంబులెన్స్‌ల కోసం ఒప్పందం జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు.


2020లో పాత అంబులెన్స్‌లకు రూ. 2, 27, 257 చెల్లించేలా ఒప్పందం ఉంది. కొత్త అంబులెన్స్ వాహనాలకు రూ.1,75078లు మొత్త చెల్లించేలా ఒప్పందం చేసుకుందని తెలిపారు. సరైన సేవలు ఇవ్వకుండా కోట్లు దండుకుని 108 వ్యవస్ధను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. గోల్డెన్ హవర్‌లో వైద్య సర్వీసులు చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు. 11 నుంచి 20 శాతం వరకూ మాత్రమే గోల్డెన్ అవర్‌లో రోగులను ఆస్పత్రులకు చేర్చగలిగారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.


అరబిందో సంస్థపై ఆరోపణలు వెలుగులోకి...

వైసీపీ ప్రభుత్వ హయాంలో 108, 104 వాహనాల నిర్వహణ బాధ్యతలను అరబిందో సంస్థ చూసేది. ఆ సంస్థపై ఆది నుంచి చాలా ఆరోపణలు వచ్చాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి అక్రమాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో కాంట్రాక్టు గడువు ఉండగానే.. నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో తప్పుకుంది. దీనిని కూటమి ప్రభుత్వం ఆమోదించింది. దీంతో 108, 104 సిబ్బందిలో ఆందోళన మొదలైంది. బకాయి వేతనాలను అరబిందో ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా తెలియడం లేదని బాధితులు వాపోతున్నారు. నెలనెలా వేతనాలను ఇవ్వకుండా అరబిందో సంస్థ తమను ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు తమను నట్టేట వదిలేసి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తేనే వేతనాలు ఇస్తామని ఆ సంస్థ అంటోందని వాపోతున్నారు. అరబిందో స్థానంలో నిర్వహణ బాధ్యతలను మరొకరికి అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో వేతన బకాయిలపై స్పష్టత ఇవ్వాలని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.


సిబ్బందికి ఆర్థిక ఇబ్బందులు..

ప్రాణాపాయ స్థితిలో ఉండేవారిని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తున్న 108తోపాటు.. గ్రామీణ ప్రజల వద్దకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న 104 సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు నెలల నుంచి వీరికి వేతనాలు అందడం లేదు. వచ్చేది తక్కువ వేతనం. అదీ నెలనెలా అందడం లేదు. తాజాగా నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ తప్పుకోవడంతో బకాయి వేతనాలు వస్తాయో లేదోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. వేతనాలు రాకపోతే తమకు పూట గడవటం కష్టమవుతుందని, అలాంటిది పండుగల సమయంలో కూడా వేతనాలు అందలేదని వాపోతున్నారు. కుటుంబ పోషణకు అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అరకొర వేతనాలు..

శ్రీసత్యసాయి జిల్లాలో 104 వాహనాల్లో 74 మంది పనిచేస్తున్నారు. వీరిలో పైలెట్‌లు (డ్రైవర్లు) 35 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 35 మంది, అదనపు సిబ్బంది నలుగురు ఉన్నారు. ఒక్కో 104 వాహనంలో ఇద్దరు పనిచేస్తున్నారు. నెలలో 26 రోజులు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ పనికి తగ్గ వేతనం అందడం లేదు. పైలెట్లకు రూ.12,900, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.12,500 చెల్లిస్తున్నారు. స్లాబ్‌ ప్రకారం 2016 నుంచి పనిచేస్తున్న పైలెట్‌లకు రూ.22 వేలు వేతనం ఇవ్వాలి. కానీ పాత వేతనంతోనే సరిపెడుతున్నారు. జీఓ నంబర్‌ 7 ప్రకారం ఐదేళ్లగా పనిచేస్తున్న ప్రతి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి రూ.18,500 వేతనం ఇవ్వాలి. అమలు కావడం లేదు. 104 వాహనాల నిర్వహణ కూడా గాడి తప్పింది. టైర్లు అరిగిపోయినా పట్టించుకోలేదని, డీజిల్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని సిబ్బంది అంటున్నారు.


వందలాది మంది..

ఉమ్మడి జిల్లాలో 104 వాహనాలు 36 వరకు, 108 వాహనాలు 66 వరకూ ఉన్నాయి. ఒక్కో వాహనానికి ఒక డ్రైవర్‌, ఒక డీఈఓ ఉన్నారు. 104 వాహనంలో సీనియర్‌ డ్రైవర్‌కు రూ.24 వేలు, జూనియర్‌ డ్రైవర్‌కు రూ.16 వేలు వేతనం ఇస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.12 వేలు ఇస్తున్నారు. 108 వాహన డ్రైవర్‌కు రూ.16 వేల నుంచి రూ.26 వేల వరకు వేతనం ఇస్తున్నారు. రిలీవర్లతో కలుపుకుని ఈ రెండు వ్యవస్థల్లో 400 మంది వరకు సిబ్బంది ఉన్నారు.మూడునెలల నుంచి వేతనాలు అందకపోవడంతో కలెక్టర్‌, డీఎంహెచఓ తదితర ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. కానీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ

బాబు అరెస్టుకు.. నా స్టేట్‌మెంట్లతో లింకా..

Read Latest AP News and Telugu News

Updated Date - Nov 18 , 2024 | 12:23 PM