ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nakka Ananda Babu: వైసీపీ ప్రభుత్వంలో దోపిడీకి పాల్పడ్డారు

ABN, Publish Date - Sep 09 , 2024 | 03:51 PM

వైసీపీ ప్రభుత్వంలో దోపిడీకి పాల్పడ్డారని.. ఏపీని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆరోపణలు చేశారు. కాల్వలు, డ్రైన్లపై కనీసం దృష్టి పెట్టలేదని విమర్శలు చేశారు.

బాపట్ల జిల్లా: వైసీపీ ప్రభుత్వంలో దోపిడీకి పాల్పడ్డారని.. ఏపీని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆరోపణలు చేశారు. కాల్వలు, డ్రైయిన్లపై కనీసం దృష్టి పెట్టలేదని విమర్శలు చేశారు. వేమూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు(సోమవారం) ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పర్యటించారు.


ALSO READ: Sam Pitroda: రాహుల్ పప్పు కాదు.. ఆయనలో క్వాలిటీస్ చెప్పిన శామ్ పిట్రోడా

చుండూరు మండలం ఆలపాడు, మండూరు వేమూరు మండలం కోడిపర్రు, పెనుమర్రు, అబ్బన గొడవల్లి, కొల్లూరు మండలం రావికంపాడు, గ్రామాల్లో బాధితులను పరామర్శించి వారికి అందుతున్న సహాయక చర్యలపై వివరాలను ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అడిగి తెలుసుకున్నారు.


ALSO READ: Heavy Rains: భారీ వర్షాలు.. బొర్రా గుహలు మూసివేత

ఈ సందర్భంగా అకాల వర్షాలకు ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ... ఏపీలో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వరదల వల్ల ఉద్యాన పంటలు, వరి పొలాలు బాగా దెబ్బతిన్నాయని అన్నారు. రైతులు పూర్తిగా నష్టపోయారని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.


ఇంతటి వరదలు, వర్షాలు ఎప్పుడూ చూడలేదని చెప్పారు, ఇంకా వేమూరు నియోజకవర్గంలో పంట పొలాలన్నీ నీటిలోనే మనిగి ఉన్నాయని తెలిపారు. ఇంతటి ఘోర నష్టానికి ఒకవైపు పకృతి వైపరీత్యాలు అయితే.. ఇంకోవైపు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్యమే ఈ వరదలకు కారణమని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆరోఫణలు చేశారు.


గత ఐదేళ్లలో డ్రైయిన్‌లు, పంట కాల్వలు పట్టించుకోకపోవడంతోనే ఇంతటి ఘోర విపత్తుకి దారి తీసిందని విమర్శించారు. రైతులని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని.. చివరి ఎకరం వరకు న్యాయం జరిగేలా రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

AP Rains: అంతిమయాత్రకు తప్పని వరద కష్టాలు

Hyderabad: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు..

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 09 , 2024 | 04:02 PM

Advertising
Advertising