ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP: అందుకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు.. టీడీపీ ఎమ్మెల్యేల పంచ్‌ల వర్షం

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:33 PM

అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడానికి జగన్ మాట్లాడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అధికారం కోసం జగన్ రాజకీయాల్లో ఉన్నారు కానీ... రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్పారు. గతంలో క్యాబినెట్ సమావేశాలు కానీ, సచివాలయానికి వచ్చిన దాఖలాలు కానీ జగన్‌కు లేవని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజర్‌పై మంత్రి కొలుసు పార్థసారథి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష హోదా కోసమే అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ హోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారా అని ప్రశ్నించారు.అసెంబ్లీకి వచ్చి మైక్ ఇవ్వకపోతే అప్పుడు అడగాలని అన్నారు. రాష్ట్ర సమస్యలు జగన్‌కు పట్టవని విమర్శించారు. కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అనడం సరికాదని అన్నారు.


అసెంబ్లీకి వస్తే స్పీకర్ తప్పకుండా మైక్ ఇస్తారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 40 శాతం ఓట్లు వచ్చినంత మాత్రాన ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు. సంఖ్యా బలాన్ని బట్టి స్పీకర్ ప్రతిపక్ష హోదా కల్పిస్తారని తెలిపారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడానికి జగన్ మాట్లాడుతున్నారని అన్నారు.అధికారం కోసం జగన్ రాజకీయాల్లో ఉన్నారు కానీ... రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్పారు. గతంలో క్యాబినెట్ సమావేశాలు కానీ, సచివాలయానికి వచ్చిన దాఖలాలు కానీ జగన్‌కు లేవని విమర్శించారు. ఇంటి వద్ద నుంచి ప్రశ్నలు సంధించే బదులు అసెంబ్లీకి వచ్చి జగన్ అడగాలన్నారు. ముందు అసెంబ్లీని గౌరవించి రావాలని.. అప్పుడు మైక్ ఇవ్వకపోతే మాట్లాడాలని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.


ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక అర్హత జగన్‌‌కు లేదు: చింతమనేని ప్రభాకర్

ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక అర్హత లేకపోవడంతోనే జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. నాలాగా 175 ఎమ్మెల్యేల్లో జగన్ ఒకరని చెప్పారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ కానీ చంద్రబాబు కానీ ఇచ్చేది కాదని ప్రజలే నీకు ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలే నడ్డి విరగొట్టి స్పష్టంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ‘‘జగన్ చేసిన నేరాలు, ఘోరాలకు ప్రజలు ఇచ్చిన పనిష్మెంట్ ఇది. ఐదేళ్లు ప్రజలు అధికారం ఇస్తే నీ స్వార్థం కోసం నీ ఆస్తులు పెంచుకోవడం కోసం అధికారాన్ని ఉపయోగించుకున్నావు. వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయన్నది కాదని.. అసలు నీకు ఎన్ని సీట్లు వచ్చాయనేదే ముఖ్యం. ఒక మార్కుతో పాసైన పాస్ అయినట్టే లేకపోతే ఫెయిల్ అయినట్లే. ప్రతిపక్ష హోదాగా ప్రజలు నిన్ను ఫెయిల్ చేశారు. నాకు ఈ కర్మ ఎందుకు పట్టించారనేది ప్రజల్ని అడుగు. వచ్చే సారి ఈ 11 మంది కూడా మిగిలే పరిస్థితి ఉండదు’’ అని చింతమనేని ప్రభాకర్ విమర్శించారు.


జగన్‌‌కు ప్రతిపక్ష హోదా ప్రజలు తిరస్కరించారు: యార్లగడ్డ వెంకట్రావు

అసెంబ్లీలో మైక్ ఇవ్వలేదని చెప్పటానికి.. అసలు ఎన్ని సార్లు జగన్ వచ్చారని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండానే మైక్ ఇవ్వలేదని ఊహించుకుంటే ఎలా అని నిలదీశారు. జగన్ అన్ని సత్య దూరమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష హోదా ప్రజలు తిరస్కరిస్తే అసెంబ్లీకి రాకపోవడం ఏమిటని యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు.


ఆ పేటెంట్ హక్కులు టీడీపీవే: పంచుమర్తి అనురాధ

ప్రతిపక్ష హోదా తీసేసింది తాము కాదని.. ప్రజలే తీసివేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. శాసన మండలికి వచ్చి గొడవ చేయాలనే ఉద్దేశంతోనే వస్తున్నారని మండిపడ్డారు. విశ్వాసనీయత, విధేయత, నిజాయితీ, ప్రజల పట్ల అభివృద్ధి పేటెంట్ హక్కులు టీడీపీకే ఉన్నాయని పంచుమర్తి అనురాధ స్పష్టంచేశారు.

Updated Date - Nov 11 , 2024 | 12:34 PM