ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: నారా లోకేష్‌‌‌ను కలిసిన మాజీ మంత్రి బాధితులు

ABN, Publish Date - Jun 16 , 2024 | 04:00 PM

గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముందు ఉపాధ్యాయుల బదిలీల పేరిట భారీ అవినీతి జరిగిందని బాధితులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

అమరావతి: గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముందు ఉపాధ్యాయుల బదిలీల పేరిట భారీ అవినీతి జరిగిందని బాధితులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యా శాఖామంత్రి నారా లోకేష్‌‌ను (Nara Lokesh) బాధితులు ఈరోజు(ఆదివారం) కలిశారు. లోకేష్‌కు వినతిపత్రం ఇచ్చారు.


ఎన్డీఏ ప్రభుత్వం తమకు పీజీటీలుగా ఉపాధి కల్పిస్తే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తమను అకారణంగా తొలగించి లంచం డిమాండ్ చేశారని బాధితుల ఆరోపణలు చేశారు. లంచంఎంత ఇస్తారో చెప్పాలని అంటూ బొత్స ఓసారి, సజ్జల మరోసారి బహిరంగంగానే తమ దగ్గర డిమాండ్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారి ప్రవీణ్ ప్రకాష్ సైతం తమని అవహేళన చేశారని వాపోయారు. తమ ఉద్యోగాలు తొలగింపు అన్యాయమని న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సైతం లెక్కచేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించి న్యాయం చేస్తానని బాధితులకు లోకేష్ హామీ ఇచ్చారు.


కాగా.. బొత్స సత్యనారాయణతో పాటు విద్యాశాఖలోని కీలక అధికారికీ ఇందులో భాగస్వామ్యం ఉందని పెద్దఎత్తున బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ అవినీతిపై సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని బాధితులు కోరుతున్నారు. బొత్స, ఆయన పీఏ, పలువురు ఉన్నతాధికారులు ఈ అవినీతి చేశారని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించి.. ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.3 నుంచి 6 లక్షలు వసూలు చేశారని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Amaravati: ఆదివారమైనా తగ్గేదే లే.. లోకేష్ తీరుపై ప్రజల హర్షం..

YS Sharmila: ఫాదర్స్ డే సందర్భంగా షర్మిల భావోద్వేగ పోస్ట్..

Kodali Nani: చంద్రబాబు కాళ్ల వద్ద కొడాలి నాని.. గుంటూరులో ఫ్లెక్సీ..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 16 , 2024 | 04:20 PM

Advertising
Advertising