ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: పవన్‌కు సచివాలయంలో ఏ ఛాంబర్ కేటాయించారంటే..?

ABN, Publish Date - Jun 18 , 2024 | 06:52 PM

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేపు(బుధవారం) సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు సెక్రటేరియట్‌కు వెళ్లిన పవన్ తన చాంబర్‌ను చూడటం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పరిచయం చేసుకున్నారు.

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేపు(బుధవారం) సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు సెక్రటేరియట్‌కు వెళ్లిన పవన్ తన చాంబర్‌ను చూడటం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పరిచయం చేసుకున్నారు. సుమారు గంటన్నరపాటు సెక్రటేరియట్‌లో గడిపిన సేనాని.. రెండో బ్లాక్‌లో ఉన్న తన చాంబర్‌ను నిశితంగా పరిశీలించారు. అనంతరం మొదటి బ్లాక్‌కు వెళ్లిన పవన్.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎంకు సాదర స్వాగతం పలికిన సీఎం, ఆలింగనం చేసుకున్నారు. అయితే మంత్రులుగా పవన్ , తన బాధ్యతల స్వీకరణపై ఏబీఎన్‌తో మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) ఈరోజు(మంగళవారం) కీలక వ్యాఖ్యలు చేశారు.


212 నెంబర్ పేషీలో పవన్ బాధ్యతలు..

‘‘పవన్‌కు రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212 నెంబర్ పేషీలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఎల్లుండి నేను టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తా. పవన్ కళ్యాణ్ పేషీ నంబర్ 212లో రేపు(బుధవారం) ఉదయం 10 గంటల తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. గతంలో ఆర్థిక శాఖకు కేటాయించిన పేషీలోనే పవన్‌కు కార్యాలయాన్ని కేటాయించారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్న పేషీ నెంబర్ 211లో నాదెండ్ల మనోహర్ ముహూర్తం మేరకు బాధ్యతలు స్వీకరిస్తారు. సచివాలయంలోని రెండో బ్లాక్ మొదటి అంతస్తులోని మూడు పేజీలు వరుసగా మిత్రపక్షం జనసేన మంత్రులకు, డిప్యూటీ సీఎంకు కేటాయించారు.వైజాగ్‌లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండ రాజభవనం(జల్సా మహల్) సహా అన్నింటి పైన టైం తీసుకుని రివ్యూ చేస్తాం’’ అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Nara Bhuvaneshwari: అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజాపాలన మొదలు

Nadendla Manohar: అక్రమార్కులను ఎవరిని వదలిపెట్టం.. మంత్రి నాదెండ్ల వార్నింగ్

Pawan Kalyan: నాదెండ్ల ఓకే.. పవన్ ఏమంటారో..!!

TDP: జగన్‌ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు: మంత్రి అనగాని

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 08:28 PM

Advertising
Advertising