Andhra Pradesh: జగన్.. ఈ పాపం ఎవరిది..? వైసీపీ పాలనలో సామాన్యుడి కష్టాలు..
ABN, Publish Date - Apr 12 , 2024 | 10:01 AM
ఆంధ్రపదేశ్‌లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మంటూ వైసీపీ (YSRCP) ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. తమ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారంటూ సీఎం జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు. వాస్తవం చూస్తే మాత్రం జగన్ ప్రభుత్వంలో సామాన్యుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ప్రధానంగా వైద్య సేవల విషయంలో..
ఆంధ్రపదేశ్‌లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటూ వైసీపీ (YSRCP) ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. తమ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారంటూ సీఎం జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు. వాస్తవం చూస్తే మాత్రం జగన్ ప్రభుత్వంలో సామాన్యుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ప్రధానంగా వైద్య సేవల విషయంలో పేద ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏపీలో పేరుకి ఎన్నో రకాల పథకాలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. తీరా చూస్తే సరైన వైద్యం అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. నాడు-నేడు ద్వారా వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. ఐదేళ్ల పాలనలో వైద్య రంగాన్ని జగన్ ప్రభుత్వం భ్రష్టుపట్టిం చిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. . ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాస్కు కూడా దొరకని అధ్వానస్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి.
Nara Bhuvaneshwari: సంక్షేమం పేరిట దోచేశాడు
పేదవాడిపై భారం
2014 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన ఆరోగ్యంపై ఏడాదికి సగటు ఖర్చు 5వేల రూపాయిలు కాగా.. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 2019 నాటికి ఆరోగ్యంపై సామాన్యుడు పెట్టే ఖర్చును 950 రూపాయిలకు తగ్గించగలిగింది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అసమర్థ చర్యలతో ఆ వ్యయం 4వేల రూపాయిలకు చేరిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిని బట్టి జగన్ పాలనలో వైద్య రంగం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనలో జగన్ ప్రభుత్వం విఫలమైనట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా మందుల కొరత సమస్య వెంటాడుతూనే ఉండగా, పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే.. మందులు బయటకొనుక్కోవాలని చీటీలు రాసిస్తున్న పరిస్థితి జగన్ పాలనలో నెలకొంది. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన వైద్య సౌకర్యాలు లేవు. ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడితే తండాల నుంచి ఆసుపత్రులకు రావడానికి సరైన రహదారి సౌకర్యం లేని పరిస్థితులు ఉన్నాయి. గర్భిణులను ప్రసవం కోసం డోలీలో ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అంబులెన్సులు వచ్చే అవకాశం లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి.
ప్రశ్నిస్తే వేధింపులు..
నాడు-నేడు కింద వైద్య రం గం అభివృ ద్ధికి వేల కోట్లు కేటాయిస్తున్నామని సీఎం జగన్ గొప్పలు చెబుతున్నా.. పేద, మధ్య తరగతి ప్రజలకు సరైన వైద్యం అదండంలేదు. వైద్య సేవలు అందని కారణంగా ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. వెయ్యి రూపాయిలు దాటితే ఆరోగ్య శ్రీ పధకం అమలు చేస్తున్నామని జగన్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. వాస్తవానికి ఆరోగ్య శ్రీ అంటే వైద్యం అందించని దుస్థితి జగన్ ప్రభుత్వంలో నెలకొందనేది విపక్ష పార్టీల మాట. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. గత తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అనేక పథకాలను రాజకీయ కక్షలో భాగంగా జగన్ అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. మాస్కులు లేవని అడిగినందుకు డాక్టర్ సుధాకర్ చావుకు వైసీపీ ప్రభుత్వం కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతిని ప్రశ్నించినందుకు డాక్టర్ సుధారాణిని వైసీపీ నాయకులు లైంగికంగా వేధించిన ఘటనలు ప్రజల కళ్లముందు కనిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తూ... ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇవ్వన్నీ గమనిస్తున్న ఏపీ ఓటరు ఈ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తారనేది వేచి చూడాల్సి ఉంది.
YS Sharmila: మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 12 , 2024 | 10:02 AM