ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Protest: ఢిల్లీలో తెలుగు విద్యార్థులు ఆందోళన.. అప్రమత్తమైన పోలీసులు..

ABN, Publish Date - Sep 29 , 2024 | 05:44 PM

తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చేశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా గత టీటీడీ పాలకమండలిపైనా పెద్దఎత్తున భక్తులు మండిపడుతున్నారు.

ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతూనే ఉంది. శ్రీవారి ప్రసాదంలో జంతువుల, పంది కొవ్వు కలిపారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, వేంకటేశ్వరస్వామి భక్తులు, హిందూ సంఘాల నాయకులు సీరియస్‌గా ఉన్నారు. స్వామివారి ప్రసాదం విషయంలో అపచారం చేశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా గత టీటీడీ పాలకమండలిపైనా పెద్దఎత్తున భక్తులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం తిరుమల పర్యటన చేద్దామనుకున్న మాజీ సీఎం జగన్‌కు హిందూ సంఘాలు షాక్ ఇచ్చాయి. డిక్లరేషన్ ఇస్తేనే ఆలయంలోకి అనుమతిస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడంతో జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఢిల్లీలో తెలుగు విద్యార్థులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు.


విద్యార్థులు నిరసన..

తాజాగా తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో తెలుగు విద్యార్థులు ఆదివారం నిరసన చేపట్టారు. సనాతన ధర్మ విలువల పరిరక్షణకు మద్దతుగా "ఆల్ ఇండియా తెలుగు స్టూడెంట్స్ అండ్ యూత్ అసోసియేషన్" పెద్దఎత్తున ర్యాలీ చేపట్టింది. ఢిల్లీ గోల్ మార్కెట్‌లోని టీటీడీ ఆలయం నుంచి ఏపీ భవన్ వరకూ విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. వేల మంది స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చి టీటీడీ ఆలయానికి దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టారు. తెలుగు విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో టీటీడీ ఆలయం, ఏపీ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.


సీబీఐ విచారణ చేయాలి..

లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సీబీఐతో దర్యాప్తు జరపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆలయాల పర్యవేక్షణలో ప్రభుత్వ జోక్యం ఉండరాదని, పీఠాధిపతులు, పండితులకు వాటి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని కోరారు. ప్రసాదం కల్తీ అంశంపై జోక్యం చేసుకోవాలని ఆల్ ఇండియా తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సురేశ్ డిమాండ్ చేశారు. ప్రసాదం కల్టీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


సుప్రీంకోర్టుకు వివాదం..

మరోవైపు తిరుమల లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. వీరిద్దరూ వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. అయితే ఈనెల 30న దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని సుబ్రహ్మణ్యస్వామి కోరారు. విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో గానీ, నిపుణులతో గానీ విచారణ చేయించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 06:33 PM