ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Daggubati Purandeswari: వైసీపీ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకి గండి పడింది..

ABN, Publish Date - Sep 06 , 2024 | 01:57 PM

వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు గండి పడి విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్రమత్తమైన ఏపీ అధికార యంత్రాంగం గండి పూడ్చివేత పనులు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఆర్మీ జవాన్లతో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టింది.

AP BJP Chief Daggubati Purandeshwari

విజయవాడ: వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు గండి పడి విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్రమత్తమైన ఏపీ అధికార యంత్రాంగం గండి పూడ్చివేత పనులు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఆర్మీ జవాన్లతో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టింది. అయితే గండి పూడ్చివేత పనులను రాజమహేంద్రవరం ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీపై నిప్పులు చెరిగారు.


వైసీపీ వల్లే..

ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మాట్లాడుతూ.." బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదు. ప్రజల ప్రాణాలు పోతున్న సందర్భంలో వైసీపీ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారు. అసలు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండి పడింది. రూ.400కోట్లతో గత టీడీపీ ప్రభుత్వం బుడమేరుకట్ట పటిష్ఠతకు పనులు చేపట్టింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసింది.


కేంద్రం ఆదుకుంటుంది..

వైసీపీ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇంత పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. మిగిలిన పనులను వారి చేసి ఉంటే ఈనాడు ఇలాంటి దుస్థితి ఏర్పడేది కాదు. గత ఐదేళ్ల కాలంలో బుడమేరుకు వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో లెక్కలు చెప్పాలి. వారు చేసిన పాపాన్ని పక్కవారికి అంటకడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏపీని వరదల సమయంలో ఆదుకుంటూ వస్తోంది. గురువారం రోజున కేంద్ర మంత్రి చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. త్వరలో ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది" అని చెప్పారు.


విద్యుత్ కార్మికులు సాయం..

మరోవైపు బుడమేరు పొంగి తీవ్ర అవస్థలు పడుతున్న వరద బాధితులకు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం అండగా నిలిచింది. ఏపీ విద్యత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆధ్వర్యంలో ఒక రోజు మూల వేతనాన్ని సీఎం సహాయనిధికి అందించి కార్మికులు పెద్ద మనసు చాటుకున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబుకి విరాళాన్ని అందజేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కోట్లాది రూపాయలు వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి అందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బుడమేరును మింగేసిన వైసీపీ నాయకులు..

సజ్జలను అరెస్టు చేస్తే.. అన్నీ బయటకొస్తాయి ..

టీడీపీ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..

YCP: అధ్యక్ష బాధ్యతలా.. మాకొద్దు బాబోయ్‌..

కౌశిక్ రెడ్డికి బల్మూరి వెంకట్ కౌంటర్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 06 , 2024 | 02:01 PM

Advertising
Advertising