Share News

Kesineni Chinni: ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని సమీక్ష..

ABN , Publish Date - Nov 05 , 2024 | 02:33 PM

Andhrapradesh: ఎన్డీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈరోజు సమీక్షలో అనేక అంశాలపై చర్చించామని.. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అన్ని పీహెచ్.సి సెంటర్లో అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Kesineni Chinni:  ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని సమీక్ష..
MP Kesineni Shivanath

విజయవాడ, నవంబర్ 5: వ్యవసాయపరంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులను ప్రోత్సహిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shivanath) అన్నారు. డ్రోన్లను ఉపయోగించి వ్యవసాయ పద్ధతులు అవలంబించేలా శిక్షణ ఇస్తామని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. మంగళవారం ఎన్డీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఈరోజు సమీక్షలో అనేక అంశాలపై చర్చించామని.. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. అన్ని పీహెచ్.సి సెంటర్లో అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని పీహెచ్‌సీ సెంటర్లను పూర్తిగా ఆధునీకరిస్తామని వెల్లడించారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌తో కూడా ఇప్పటికే మాట్లాడి నిధుల అంశాలను కూడా ప్రస్తావించామని చెప్పారు.

Supreme Court: జెత్వానీ కేసు.. సుప్రీంను ఆశ్రయించిన విద్యాసాగర్


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా కలిసి అన్నీ‌ వివరిస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలు అనేకం అద్దె భవనాలు ఉన్నాయని.. వాటికి సొంతభవనాలు అవసరం ఉందన్నారు. మారుమూల గ్రామాల్లో కూడా తాగునీటి అవసరాలు తీర్చే విధంగా ప్రత్యక్ష చర్యలు చేపడతామన్నారు. ప్రతి పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తామన్నారు. ప్రతి స్కూల్లో ఆట స్థలం ఉండాలని భావిస్తున్నామని.. దానికి తగ్గట్టు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

DGP Dwaraka Tirumala Rao: పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన డీజీపీ ద్వారక తిరుమలరావు


రూరల్ డెవలప్మెంట్‌లో కూడా ఎన్నో పథకాలు అమలులో ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ద్వారా బ్యాంకు నుంచి రుణాలు కూడా అందించేలా చేస్తామన్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో అమరావతి అభివృద్ధిని అందరూ చూస్తారని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఎన్టీఆర్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కూడా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు వర్తింపజేసి ఆర్థిక పురోగతి సాధించేలా చూస్తామన్నారు. వరదల సమయంలో అందరూ కలిసి కట్టుగా పని చేశారని.. ఇదే విధంగా జిల్లా అభివృద్ధిలో అందరూ సమన్వయంతో పని చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి..

Nagula chavithi: విజయవాడలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 02:35 PM