ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: ప్రజలే ఫస్ట్ ప్రయారిటీ.. రూట్ మార్చిన కూటమి ప్రభుత్వం..!

ABN, Publish Date - Aug 05 , 2024 | 04:39 PM

ప్రజలు అధికారం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు.. బాధ్యతతో వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికే అని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నోసార్లు చెప్పారు.

TDP and Janasena

ప్రజలు అధికారం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు.. బాధ్యతతో వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికే అని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ఇవ్వన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి.. కానీ ఓసారి అధికారం వచ్చిన తర్వాత ఆచరించేదెవరనే విమర్శలు వచ్చాయి. ఎవరేమి అనుకున్నా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం తాము ప్రజలకు ఇచ్చిన మాటను ఆచరణలో పెట్టి చూపించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు అహంకారంతో ఉండొద్దని, ప్రజలకు జవాబుదారీగా ఉండేలా వ్యవహరించాలని ఎమ్మెల్యేలతో పాటు నాయకులందరికీ చెప్పారు. ప్రజలే టాప్ ప్రయారిటీగా పనిచేయాలని, ప్రజల ఆదరాభిమానాలు పొందితేనే మళ్లీ.. మళ్లీ అధికారాన్ని అప్పగిస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలని రెండు పార్టీల అధినేతలు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించిన తీరు, ప్రజలు ఆ పార్టీని రెండోసారి తిరస్కరించిన తీరు ఆధారంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటిరోజు నుంచే ప్రజల పక్షంగా పాలన సాగించాలని చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ నేతలకు చెప్పడమే కాదు.. స్వయంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆచరించడం మొదలు పెట్టారు.

CM Chandrababu: పవన్‌కు పెద్ద బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు


ప్రజాదర్బర్..

తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రతి రోజు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో ప్రజలు తమ సమస్యలను నేరుగా చెప్పుకోవచ్చు. సమస్య తీవ్రతను బట్టి తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు ప్రతి రోజు ఈ కార్యక్రమానికి ఒక మంత్రి తప్పకుండా హాజరుకావాలని చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. నేరుగా మంత్రి స్థాయి వ్యక్తి వినతులు స్వీకరించడం ద్వారా సంబంధిత శాఖ అధికారులతో అప్పటికప్పుడే మాట్లాడి బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. టీడీపీ అనుసరిస్తున్న విధానాన్ని జనసేన అమలుచేయడం ప్రారంభించింది. జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆగష్టు ఒకటో తేదీ నుంచి ప్రతిరోజు ప్రజాదర్బార్‌ను ప్రారంభించింది. పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరై వినతులు స్వీకరించి.. తక్షణమే పరిష్కరించే సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ జనసేన నాయకులను ఆదేశించారు. దీంతో ఓవైపు, టీడీపీ, మరోవైపు జనసేన ప్రజదర్బార్ నిర్వహిస్తుండగా.. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను ప్రజాదర్బార్‌లో విన్నవించుకుంటున్నారు. దీని ద్వారా తమ సమస్య ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి స్థాయి వ్యక్తుల దృష్టిలో ఉందని, పరిష్కారమవుతుందనే నమ్మకం ప్రజల్లో కలుగుతుందనే చర్చ జరుగుతోంది.

SupremeCourt: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా


వైసీపీ హయాంలో..

వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారని జోరుగా ప్రచారం చేశారు. కానీ కార్యరూపం దాల్చలేదు. గడపగడపకు వైసీపీ పేరుతో ఎమ్మెల్యేలు తిరిగినా.. ప్రభుత్వం చేసిన గొప్పలు చెప్పుకోవడానికి తప్పా.. ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరైనా ప్రజలు తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేసినా నాయకులు వినేవారు కాదు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. మరోవైపు ఏవైనా సమస్యలు ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం చెప్పింది. కానీ సకాలంలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతుందనే ఆలోచన ప్రజల్లో కలిగేది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి ఇది ఒక కారణంగా కొందరు చెబుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా టీడీపీ కూటమి ప్రభుత్వం రూట్ మార్చి.. ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించి ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Ramakrishna: భూ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది...

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 05 , 2024 | 04:39 PM

Advertising
Advertising
<