ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Varla Ramaiah: వైసీపీ బోట్ల కుట్రను పోలీసులు సీరియస్‌గా విచారించాలి

ABN, Publish Date - Sep 10 , 2024 | 08:31 PM

కూటమి ప్రభుత్వం మీద బోట్లతో వైసీపీ నేతలు పన్నిన కుట్రను దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీరియస్‌గా విచారించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌‌ను ఇసుక పడవలు ఢీ కొట్టడం.. వైసీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాంల కుట్రేనని ఆరోపణలు చేశారు.

అమరావతి: కూటమి ప్రభుత్వం మీద బోట్లతో వైసీపీ నేతలు పన్నిన కుట్రను దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీరియస్‌గా విచారించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌‌ను ఇసుక పడవలు ఢీ కొట్టడం.. వైసీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాంల కుట్రేనని ఆరోపణలు చేశారు. జగన్ గత ఐదేళ్ల పరిపాలన అంతా అరాచకం, అస్తవ్యస్తమని ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలతో కూడుకున్న పాలన జగన్‌ది అని వర్ల రామయ్య విమర్శలు చేశారు.


జగన్ పాలన నేరపూరితమే..

జగన్ పాలన అంతా నేరపూరితమేనని విమర్శలు చేశారు. గతంలో అధికారంలోకి రావడానికి కూడా జగన్ ఎన్నో క్రిమినల్ ఆలోచనలు చేశారని వర్ల రామయ్య ఆక్షేపించారు. ప్రకాశం బ్యారేజ్‌ను కుట్రతో ధ్వంసం చేయాలనుకున్నారని.. ఇది దేశ ద్రోహం నేరంతో సమానమని అన్నారు. చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని కుట్ర పన్ని పడవలతో ప్రకాశం బ్యారేజ్‌ను ఢీ కొట్టేలా జగన్ ప్లాన్ చేశారని వర్ల రామయ్య విమర్శించారు. ఆ పడవలు సరిగ్గా బ్యారేజ్‌‌‌ను ఢీకొని ఉంటే దివిసీమ ఉప్పెన కంటే ప్రమాదం ఘోరంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఊర్లన్నీ మునిగిపోయి ప్రజల ప్రాణాలు పోయేవని వర్ల రామయ్య ఆరోపించారు.


ALSO READ: CM Chandrababu: సీఎం చంద్రబాబు విజ్ఞప్తి.. ముందుకొచ్చిన ఎలక్ట్రానిక్ కంపెనీలు

వరద వచ్చే ముందే కుట్ర పన్నారు..

వరద వచ్చే ముందు రోజే ఉద్దండరాయుని పాలెంలో ఉన్న పడవలను ప్రకాశం బ్యారేజ్ వైపునకు కుట్రపూరితంగా తీసుకు వచ్చారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన వారు పాత్రధారులు మాత్రమేనని .. అసలు సుత్రధారులను బయటకు తీసుకు రావాలని ప్రభుత్వాన్నికోరారు. వైసీపీ నేతలు తలశీల రఘురాం, నందిగం సురేశ్, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలు కలిసి... 20 లక్ష ఎకరాల సాగును నాశనం చేసేందుకు కుట్ర చేశారని వర్ల రామయ్య విమర్శించారు. ఇంత విధ్వంసానికి కుట్ర పన్నిన మాజీ ఎంపీ సురేష్ కటకటాల్లో ఉంటే... జగన్ వెళ్లి ఆయనను పరామర్శించాలనుకోవడం సిగ్గుచేటు అని వర్ల రామయ్య విమర్శించారు.


ALSO READ: Chandrababu vs Jagan: ప్రజలతో చంద్రబాబు.. ప్యాలెస్‌లో జగన్..

కుట్రధారులను శిక్షించాలి..

సురేష్‌ను పరామర్శించడంపై జగన్ మరోసారి పునరాలోచించాలని చెప్పారు. ఇది దేశద్రోహం నేరంతో సమానంగా పరిగణించి.. ఏపీ డీజీపీ దీనిపై దృష్టి పెట్టి అసలు కుట్రధారులను శిక్షించాలని వర్ల రామయ్య కోరారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం జగన్ తన బాబాయి (మాజీ మంత్రి వివేకానందారెడ్డిని) గొడ్డలి వేటుకు బలిచేశారని విమర్శించారు. ఆ కేసును అడ్డుకునేందుకు సీబీఐ అధికారులపై కూడా కేసులు పెట్టించిన నైజం జగన్ రెడ్డిది అని వర్ల రామయ్య ఆరోపించారు.

కోడి కత్తి కేసులో దళిత యువకుడిని బలిచేశారని ఐదేళ్లు అతను జైల్లో ఉండటానికి జగన్ రెడ్డే కారణమని వర్ల రామయ్య విమర్శలు చేశారు. తునిలో రైలును దగ్ధం చేశారని.. ఇవి జగన్ రెడ్డి, సజ్జలకు తెలియకుండా జరిగిందా?.. వారే కారణమోననే విషయంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని అన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తన అధికారం నిలబెట్టుకోవడానికి గులకరాయి డ్రామాకు జగన్ తెరలేపారని వర్ల రామయ్య ఆరోపించారు.


ALSO READ: Chandrababu vs Jagan: ప్రజలతో చంద్రబాబు.. ప్యాలెస్‌లో జగన్..

ప్రకాశం బ్యారేజ్‌కు ఎసరు పెట్టాలని చూశారు..

ఏదైనా చేసి అధికారం పొందాలని జగన్ కుట్రలు చేశారని వర్ల రామయ్య విమర్శించారు. ఎప్పుడు లేని విధంగా రికార్డులను తగలబెట్టి.. తప్పుల నుంచి తప్పించుకోవాలని కుట్ర చేశారని విమర్శించారు. రాజకీయం కోసం పింఛన్‌లు ఇవ్వకుండా ఎండల్లో తిప్పి 33 మంది అవ్వాతాతల చావుకు జగన్ కారణం అయ్యారని విమర్శించారు. క్రిమినల్ ఆలోచనలతోనే నేడు ప్రకాశం బ్యారేజ్‌కు ఎసరు పెట్టాలని చూశారని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన పడవలకు వైసీపీ రంగులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వర్ల రామయ్య ఆరోపణలు చేశారు.


టీడీపీ కార్యాలయంపై దాడి..

టీడీపీ కార్యాలయంపై దాడిచేయించడానికి వెనుకాడని వ్యక్తి బ్యారేజ్‌పై కుట్ర చేయలేదంటే ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నించారు. నేడు వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆపన్నహస్తం ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు. జగన్ అధికారంలో ఉంటే అల్లాడే వాళ్లమని బాధితులే అంటున్నారని వర్ల రామయ్య వెల్లడించారు.


ALSO READ: CM Chandrababu: జగన్ చేసిన జాతి ద్రోహం ఫలితమే బెజవాడ ముంపునకు కారణం

ముద్రగడ పద్మనాభంను కులం మార్చుకునేలా చేశారు..

ముద్రగడ పద్మనాభంను తన కులం మార్చుకునేలా చేసిన ఘనత కూడా జగన్ రెడ్డిదేనని విమర్శించారు. ప్రకాశం బ్యారేజ్‌కు ఎసరు పెట్టిన వ్యక్తి ఏదైనా చేయొచ్చని.. జాగ్రత్తగా ఉండాలని వర్ల రామయ్య అన్నారు. అధికారులు, ప్రజలు వారి కుట్రపూరితమైన ఆలోచనలపై అప్రమత్తంగా ఉండాలని వర్ల రామయ్య సూచించారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కూడా ఇది కుట్ర అని.. ఈ పడవల ఢీ కొన్న విషయం వెనుక ఎవరు ఉన్నా శిక్షిస్తామని పోలీసులు తెలిపారని వర్లరామయ్య గుర్తుచేశారు.


ఈ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

CM Chadrababu: ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..

Janasena: జనసేన జెండాకు ఘోర అవమానం.. భగ్గుమన్న జనసైనికులు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Sep 10 , 2024 | 09:12 PM

Advertising
Advertising