Share News

Elections 2024: కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

ABN , Publish Date - May 19 , 2024 | 08:43 AM

కృష్ణాజిల్లా, గుడివాడ: ఓటర్లకు డబ్బులు పంచకుండా కొందరు కాజేశారంటూ గుడివాడ సీనియర్ వైసీపీ మైనార్టీ నేత సర్దార్ బేగ్ ఆరోపణలు చేశారు. డబ్బు కాజేసిన వారిపై పెంపుడు కుక్కలు వదలాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Elections 2024: కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

కృష్ణాజిల్లా, గుడివాడ: ఓటర్లకు (Voters) డబ్బు (Money)లు పంచకుండా కొందరు కాజేశారంటూ గుడివాడ సీనియర్ వైసీపీ మైనార్టీ నేత (YCP Minority Leader) సర్దార్ బేగ్ (Sardar Beg) ఆరోపణలు (Comments) చేశారు. డబ్బు కాజేసిన వారిపై పెంపుడు కుక్కలు వదలాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనార్టీ వార్డుల్లో గుడివాడ (Gudivada) ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ సర్దార్ బేగ్ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


సర్దార్ బేగ్ కామెంట్స్..

కొడాలి నాని ఇచ్చిన డబ్బును కొందరు ఓటర్లకు పంచకుండా తమ వద్దే ఉంచుకొని జల్సాలు చేయడానికి, విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, చిన్ని (కొడాలి నాని తమ్ముడు) ఆ డబ్బులు కాజేసిన వారందరినీ కల్యాణమండపానికి (కె.కన్వెన్షన్‌కు) పిలిపించి నిలదీయాలన్నారు. నిజం చెప్పిన వారిని వదిలేసి డబ్బు వసూలు చేయాలని సూచించారు. ఇవ్వని వారిపైకి మీ పెంపుడు కుక్కలను వదిలేయాలన్నారు. నమ్మక ద్రోహం చేసిన వారిలో 10, 11, 12(మైనార్టీ) వార్డుల్లోని వారున్నారని సర్దార్ బేగ్ అన్నారు.


‘‘చిన్ని అన్నా.. మీరు వేగంగా వారిని పిలిచి డబ్బులు వసూలు చేయండి. లేదంటే ఒకరు గోవా, మరొకరు సింగపూర్, మలేషియా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకూ పనికిరానోడి వద్ద కూడా రూ.50 వేల కట్టలు కనిపిస్తున్నాయి... నాని గెలుపు కోసం కష్టపడిన మా కుర్రోళ్లను తిన్నారా? లేదా? అని అడిగినవారు లేరు... కనీసం బేటాలు ఇవ్వలేదు. మేము సొంత డబ్బును పార్టీ కోసం ఖర్చుపెట్టాం... మీ వద్ద డబ్బులు నొక్కేసినవారిని మాత్రం వదలొద్దు. నా పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నా. మాకు అలాంటివేమీ తెలియవు’’ అంటూ కామెంట్ చేశారు. దీంతో తామిచ్చిన డబ్బును ఎవరు పంచారు? ఎవరు నొక్కేశారన్న వివరాలను కొడాలి నాని వర్గం తాజాగా సేకరిస్తున్నట్టు సమాచారం. తమను మాత్రమే నిలదీసి, నిజంగా డబ్బు తినేసిన వాళ్లను వదిలేస్తారా? అని ప్రశ్నిస్తూ సర్దార్‌బేగ్‌ లాంటివారు కొడాలి నాని, చిన్నిలకు పంపిన సందేశాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్టీఆర్ జిల్లా: లూజ్ పెట్రోల్ నిలిపివేత

తమిళనాడులో ‘రెడ్ అలర్ట్’ జారీ

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 08:43 AM