ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS SHARMILA: అదానీ స్కాంలో జగన్‌పై విచారణ చేయించండి..

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:58 PM

అదానీ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాత్రపై ఏపీ ప్రభుత్వం విచారణ చేయించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ స్కాంపై ఏసీబీతో విచారణ చేయించాలని కోరారు. ఈ స్కాంలో నిజాలు నిగ్గుతేల్చాలని అన్నారు.

విజయవాడ: రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ సిట్ వేయడం సంతోషకరమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ అని ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్‌పై ఎందుకు పెట్టలేక పోతున్నారని నిలదీశారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా అని వైఎస్ షర్మిల అడిగారు.


మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే , నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తోంది కదా అని అన్నారు. నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా.. SECIతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి ఉందని అనలేదా అని నిలదీశారు. టెండర్లు లేకుండా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని గతంలో ఆరోపణలు చేయలేదా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.


ఏసీబీతో విచారణ చేయించాలి..

‘‘గుజరాత్‌లో రూ 1.99 పైసలు దొరికే సోలార్ విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎలా కొన్నారని ఉద్యమాలు చేశారు. 25 ఏళ్ల పాటు డీల్ అంటే రాష్ట్ర ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు. ఇది ప్రజలను అదానీ కోసం నిలువునా దోచి పెట్టడం అని చెప్పారు. ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా హైకోర్టులో కేసు కూడా వేయించారు. జగన్ అదానీకి అమ్ముడు పోయారని.. దీనిపై విచారణ చేయించాలని చంద్రబాబుని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వెంటనే ఏసీబీతో విచారణ చేయించాలని కోరారు. రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించండి. తక్షణం అదానీతో చేసుకున్న సోలార్ పవర్ డీల్‌ను రద్దు చేయండి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

YSRCP: వైసీపీ కీలక నేత అరెస్ట్.. ఎందుకంటే

AP High Court : గంజాయి కేసుల్లో ఇదేం తీరు?

CBI : ‘కంటెయినర్‌లో డ్రగ్స్‌’ కథ కంచికి!?

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 01:05 PM