Share News

భూ సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:55 AM

భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు.

భూ సమస్యల పరిష్కారానికే  గ్రామ సభలు
అల్లూరులో వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే జయసూర్య

నందికొట్కూరు రూరల్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు. అల్లూరులో మంగళవారం తహసీల్దార్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రీ సర్వేలో వచ్చిన భూసమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ గ్రామ సభను నిర్వహించారు. ముఖ్య అథిగా ఎమ్మెల్యే హాజరై రైతుల నుంచి వినతులను స్వీకరించారు. ఆర్‌ఐ సత్యనారాయణ, వీఆర్వోలు స్వామన్న, వెంకటేశ్వర్లు, నరసరాజు, ఆనంద్‌, మద్దిలేటి, టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్ర నాథరెడ్డి, గ్రామ సర్పంచ్‌ చిన్న నాగలక్ష్మయ్య, వడ్డెమాను సర్పంచ్‌ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

పగిడ్యాల: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య చెప్పారు. పగిడ్యాల తహసీల్దార్‌ కార్యా లయం వద్ద మంగళవారం తహసీల్దార్‌ శివ రాముడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఎంపీడీవో సుమిత్రమ్మ, టీడీపీ నాయకుడు సురేంద్రనాథ్‌రెడ్డి, మండల కన్వీనర్‌ మహేశ్వరరెడ్డి, దామోదరరెడ్డి, రాజశేఖరరెడ్డి, వాసురెడ్డి, వెంకట్‌రెడ్డి, లోకానందరెడ్డి, రామిరెడ్డి , ఫరూక్‌బాషా, వెంకటేశ్వర్లు, బాలీశ్వరగౌడ్‌, రమణ పాల్గొన్నారు.

పగిడ్యాలలో శిథిలావస్థకు చేరుకున్న తహసీల్దార్‌ కార్యాలయానికి మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే జయసూర్య అధికారులను ఆదేశించారు. తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలను ఎమ్మెల్యే పరిశీలించారు. పీఆర్‌ ఏఈ జావీద్‌ను పిలించి వెంటనే మైనర్‌ రిపేరీలు చేపట్టాలని సూచించారు.

కొత్తపల్లి: కొత్తపల్లిలో తహసీల్దార్‌ ఉమారాణితో పాటు డిప్యూటీ తహసీల్దార్‌ పెద్దన్న గ్రామ సభలు నిర్వహించారు. జడ్పీటీసీ సోముల సుధాకర్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ శ్రీనాథ్‌రెడ్డి, నాయకులు నాగేశ్వరరావు యాదవ్‌, మోహన్‌ యాదవ్‌, మండల సర్వేయర్‌ అనూషారాణి, వీఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.

గోస్పాడు: రీ సర్వేలో వచ్చిన భూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని జేసీ విష్ణు చరణ్‌ అన్నారు. మంగళవారం జిల్లెల్లలో జరిగిన గ్రామ సభలో జేసీ పాల్గొన్నారు. ఆర్డీవో మల్లికార్జునరెడ్డి, ఏడీ జయరాజు, తహసీల్దార్‌ షేక్‌ మోహిద్దీన్‌, ఆర్‌ఐ చంద్రమోహన్‌రెడ్డి, సర్వేయర్‌ రమణ, వీఆర్వోలు పాల్గొన్నారు.

పాణ్యం: ఆలమూరులో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దారు నరేంద్రనాథరెడ్డి చెప్పారు. సర్పంచ్‌ మనోహర్‌, డీటీ శివ శంకర్‌, ఆర్‌ఐ రాము, వీఆర్వో పద్మావతి, సర్వేయరు నాగరాజు, మాజీ ఎంపీటీసీ మల్లు రామగోవిందరెడ్డి పాల్గొన్నారు.

గడివేముల: బూజనూరులో గ్రామసభ నిర్వహిం చారు. తహసీల్దార్‌ వెంకటరమణ, డీటీ హరికృష్ణ, సర్పంచ్‌ రాములమ్మ, టీడీపీ సీనియర్‌ నాయకులు రామచంద్రారెడ్డి, వీఆర్వో పాల్గొన్నారు.

మహానంది: బసాపురంలో గ్రామసభ నిర్వహించారు. తహసీల్దార్‌ రమాదేవి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వెంకట సుబ్బారావు, టీడీపీ నాయకులు మహేశ్వరరెడ్డి, రవినాథరావు, చంద్రమౌళీశ్వరరెడ్డి పాల్గొన్నారు.

ఆత్మకూరు రూరల్‌: కరివేనలో గ్రామ సభను నిర్వహించారు. తహసీల్దార్‌ రత్నరాధిక, ఎంపీపీ తిరుపాలమ్మ, టీడీపీ నాయకులు శివశంకరశర్మ, ఓబులేసు, శేషన్న, పరశురాం, దినకర్‌, శరత్‌, ఈశ్వరయ్య పాల్గొన్నారు.

వెలుగోడు: బోయరేవులలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్‌ శ్రీనివాసగౌడ్‌. డిప్యూటీ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, డీఐవో రవీంద్రపాల్‌, సర్వేర్‌ ఉపేంద్ర, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:55 AM