Nara Lokesh: ధన దాహంతో పారిశ్రామిక వేత్తలను ఇబ్బంది పెట్టారు
ABN , Publish Date - Mar 19 , 2025 | 09:27 PM
Nara Lokesh: స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు పరిశ్రమలపై స్పష్టమైన అవగాహన మంత్రి నారా లోకేష్ తెలిపారు. మల్లవల్లి పారిశ్రామికవాడకు మరిన్ని పరిశ్రమలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆ బాధ్యత తీసుకుంటారని.. ఆ క్రమంలో అందరితో ఆయన మాట్లాడతారని నారా లోకేష్ పేర్కొన్నారు.

విజయవాడ, మార్చి 19: వైసీపీ నేతల ధన దాహంతో పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు పెట్టారని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమలు, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుపై దృష్టి సారించామని చెప్పారు. బుధవారం విజయవాడ సమీపంలోని గన్నవరం నియోజకవర్గ పరిథిలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 2019-24 మధ్య ఏపీ నుంచి అనేక పరిశ్రమలు తరలి వెళ్లి పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా రాని పరిస్థితిని ఆ నాటి పాలకులు తీసుకు వచ్చారన్నారు. ఇంకా చెప్పాలంటే.. 2014-2019 లో చేసిన ఒప్పందాలను గత పాలకులు అర్ధం లేకుండా చేశారని మండిపడ్డారు.
యువగళం పేరిట తాను చేపట్టిన పాదయాత్రలో భాగంగా మల్లవల్లి పారిశ్రామిక వాడకు తాను వచ్చానని ఈ సంద్భంగా నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అశోక్ లేలాండ్ ప్లాంట్ నిర్మాణం నిలిచి ఉందని స్పష్టం చేశారు. అశోక్ లేలాండ్ సంస్థ ముందుకు వచ్చి ప్లాంట్ నిర్మాణం చేపట్టిందన్నారు. ఈ సంస్థ అత్యాధునిక సౌకర్యాలతో వివిధ రకాల బస్సులను తయారు చేస్తున్నారని వివరించారు. ఈ సంస్థ ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ప్రధాని ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో అశోక్ లేలాండ్ సంస్థ విధానాలను అమలు చేస్తుందని చెప్పారు. అలాగే త్వరలో మచిలీపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు రానుందన్నారు. గత పది నెలల్లో ఏపీకి రూ. 7 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని గణాంకాలతో సహా మంత్రి నారా లోకేష్ విశదీకరించారు. తద్వారా నాలుగు లక్షల మందికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ఇక ఏపీ అసెంబ్లీలో కొత్తగా అడుగు పెట్టిన ఎమ్మెల్యేలు 50 శాతం మంది ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వ కేబినెట్‌లోని 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్త వారేనని చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు పరిశ్రమలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అలాగే మల్లవల్లి పారిశ్రామిక వాడకు మరిన్ని పరిశ్రమలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆ బాధ్యత తీసుకుంటారని.. ఆ క్రమంలో అందరితో ఆయన మాట్లాడతారన్నారు. అశోక్ లేలాండ్ సంస్థ స్పూర్తితో రాష్ట్రానికి చాలా మంది పారిశ్రామిక వేత్తలు వస్తారని తెలిపారు. ప్రతిభ ఉన్న యువతను గుర్తించి ప్రోత్సహించాలని సిఎం చంద్రబాబు తమకు ఎప్పుడూ చెబుతుంటారన్నారు. అటువంటి యువత ప్రతిభను మనమే వినియోగించుకునేలా ఇక్కడే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందని నారా లోకేష్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Good News For AP People: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
KGBV: కేజీవీబీ ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం.. ఎప్పటి నుంచంటే..
Central Cabinet Meeting : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
Reduce Obesity Tips: ఊబకాయాన్ని తగ్గించుకోనేందుకు.. జస్ట్ ఈ చిట్కాలు..
Summer Tips: వేసవిలో.. ఉదయం వీటిని టిఫిన్‌గా తీసుకోండి.. అదిరిపోద్ది
For AndhraPradesh New And Telugu News