Akhilesh Yadav:1000 మంది హిందూ భక్తులు మాయం: అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 19 , 2025 | 09:28 PM
మహాకుంభ్‌ను పదేపదే తలుచుకోవడం మంచి విషయమేనని, అయితే మహాకుంభ్ నిర్వహణకు భారత ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఇచ్చిందనేది ప్రధాన ప్రశ్న అని అఖిలేష్ యాదవ్ అన్నారు.

లక్నో: ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల ముగిసిన మహా కుంభమేళాపై సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో పాల్గొన్న సుమారు 1,000 మంది హిందూ భక్తుల జాడ ఇప్పటికీ తెలియలేదని, వారి ఆచూకీని కనిపెట్టడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
Farmer Leaders Arrest: సరిహద్దు పాయింట్ల వద్ద ఉద్రికత.. రైతు నేతల అరెస్టు
బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, మహాకుంభ్‌ను పదేపదే తలుచుకోవడం మంచి విషయమేనని, అయితే మహాకుంభ్ నిర్వహణకు భారత ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఇచ్చిందనేది ప్రధాన ప్రశ్న అని అన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు కేవంలం వాహనాల పార్కింగ్ ఎరేంజ్‌మెంట్లు మాత్రమే చేశారని ఆయన చెప్పారు. కుంభమేళాలో సరైన ఏర్పాట్లు లేవని చెబుతూ పలువురు భక్తులను ముందుకు వెళ్లకుండా ఐపీఎస్ అధికారులు అడ్డుకున్నారని ఆరోపించారు. కుంభమేళాలో తప్పిపోయిన సుమారు 1000 మంది హిందూభక్తుల జాడ ఇప్పటికీ తెలియలేదన్నారు. ప్రయోగరాజ్‌లో ఇందుకు సంబంధించిన కొన్ని పోస్టర్లు ఉన్నాయని, అయితే వాటిని బీజేపీ సర్కార్ తొలగించడం విచారకరమని చెప్పారు. తప్పిపోయిన వారి ఆచూకీ కనిపెట్టి వారిని కుటుంబసభ్యుల వద్దకు చేర్చాలని డిమాండ్ చేశారు. మహాకుంభ్ కోసం కేంద్రం నుంచి ఎంత ఫండింగ్ వచ్చిందో కూడా యోగి సర్కార్ వెల్లడించాలని అన్నారు.
ఇవి కూడా చదవండి
Aurangzeb tomb row: ఒసామాబిన్ లాడెన్ ప్రస్తావన చేసిన ఏక్‌నాథ్ షిండే
PM Narendra Modi: చెక్కుచెదరని విశ్వాసానికి సునీతా విలియమ్స్ నిదర్శనం: ప్రధాని మోదీ..
Ranya Rao: సినిమాలు వదిలేసి.. దుబాయికు రన్యారావు.. ఈ ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి