పిల్లల ఆధార్ నమోదును పూర్తి చేయాలి: కలెక్టర్
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:52 AM
0-5 సంవత్సరాలలోపు పిల్లల ఆధార్ వివరాల నమోదును పూర్తి చేయాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.

కర్నూలు కలెక్టరేట్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): 0-5 సంవత్సరాలలోపు పిల్లల ఆధార్ వివరాల నమోదును పూర్తి చేయాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంటు, ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ అంశాలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 0 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లల ఆధార్ నమోదులో జిల్లా వెనుకబడి ఉందన్నారు. జిల్లాలో ఉన్న 106 ఆధార్ కేంద్రాలు ఉన్నాయని, రోజుకు 20 చొప్పున నెలలోపు ఆదార్ ఎన్‌రో ల్‌మెంటును పూర్తి చేయాలని జడ్పీ సీఈవో, ఐసీడీఎస్ పీడీలను ఆదేశించారు. ఐదేళ్ల తర్వాత ఆధార్ అప్‌డేషన్ చేసుకోవాలని, 15 నుంచి 17 సంవత్సరాల మధ్య కూడా మరొకసారి కూడా అప్‌డేషన్ చేసుకో వాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ఐసీడీఎస్ పీడీ నిర్మల, డీఈవో శామ్యూల్ పాల్, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, డీఎల్‌డీవో రమణారెడ్డి పాల్గొన్నారు.