జిల్లా జైలు తనిఖీ
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:53 AM
పంచలింగాలలోని జిల్లా జైలును కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి మంగళవారం తనిఖీ చేశారు. ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఖైదీలు సత్పవర్తనతో శిక్ష పూర్తి చేసుకుని మంచి పౌరులుగా జీవించాలని కోరారు.

కర్నూలు లీగల్, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పంచలింగాలలోని జిల్లా జైలును కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి మంగళవారం తనిఖీ చేశారు. ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఖైదీలు సత్పవర్తనతో శిక్ష పూర్తి చేసుకుని మంచి పౌరులుగా జీవించాలని కోరారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం కావాలంటే తాము న్యాయవాదిని ఉచితంగా నియమిస్తామని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఆయన ఖైదీలకు అందించే ఆహారాన్ని, రేషన్‌ను వారి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలు పరిశీలించారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవా లని ఆయన జైలు అధికారులను ఆదేశించారు. బెయిల్ మంజూరైన ఖైదీలకు జామీనుదారులు లేని వారికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి బీ. లీలా వెంకటశేషాద్రి, న్యాయవాది శివరాం జైలు అధికారులు పాల్గొన్నారు.