ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: వైసీపీ నేతలు చేసిన పనితో ఆ గ్రామంలో టెన్షన్..

ABN, Publish Date - Sep 18 , 2024 | 12:59 PM

ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక వైసీపీ నేతలు అకారణంగా టీడీపీకి చెందిన యువకులపై దాడి చేశారు. ఇదేంటని ప్రశ్నించిన మరికొంతమంది గ్రామస్థులపైనా దాడికి యత్నించారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ శ్రేణుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వారిలో బాగా ఫ్రస్టేషన్ పెరిగింది. ఎన్నికల సమయంలోనూ ఓడిపోతామని ముందే తెలిసి ఈవీఎం యంత్రాలు పగలకొట్టడం, టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. విచక్షణా రహితంగా వీరంగం సృష్టించి భయాందోళనలకు గురి చేశారు. ఎన్నికల అనంతరం కేవలం 11సీట్లకే పరిమితమైనా వారిలో మార్పు రావడం లేదు. ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ దాడులకు దిగుతున్నారు.


తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక వైసీపీ నేతలు అకారణంగా టీడీపీకి చెందిన యువకులపై దాడి చేశారు. ఇదేంటని ప్రశ్నించిన మరికొంతమంది గ్రామస్థులపైనా దాడికి యత్నించారు. ఘర్షణలో టీడీపీకి చెందిన బోయ ఆంజనేయ, బోయ రవి, బోయ నరసింహులు, బొజ్జక్క తీవ్రంగా గాయపడ్డారు.


బాధితులను హుటాహుటిన ఎమ్మిగనూరు ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరువర్గాల ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. గత మూడు నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం. ఇకనైనా దాడులు మానేసి వైఫల్యాలపై దృష్టి పెట్టాలని వైసీపీ నేతలకు తెలుగు తమ్ముళ్లు హితవు పలుకుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Sharmila: రాహుల్‌కు బేషరుతుగా క్షమాపణ చెప్పాల్సిందే.. షర్మిల డిమాండ్

Somireddy: వరద బాధితులను అదుకోవాడం ఒక చరిత్ర..

AP News: సీఎం చంద్రబాబుకు వరద బాధితుల కృతజ్ఞతలు

Updated Date - Sep 18 , 2024 | 01:02 PM

Advertising
Advertising