Share News

Srisailam: శ్రీశైలంలో చిరుత కలకలం.. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అధికారుల విజ్ఞప్తి

ABN , Publish Date - Oct 29 , 2024 | 09:55 PM

శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. ఆర్టిసీ బస్టాండ్ సమీపంలోని ప్రహరీ గోడపై చిరుత కూర్చొని ఉండాన్ని స్థానికులు, భక్తులు గుర్తించి.. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై స్థానిక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో భక్తులతోపాటు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు.

Srisailam: శ్రీశైలంలో చిరుత కలకలం.. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అధికారుల విజ్ఞప్తి

నంద్యాల, అక్టోబర్ 29: నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తడి పొడి చెత్త సేకరణ చేసే ప్రహరీ గోడపై చిరుతపులి కూర్చుని ఉంది. ఒక్కసారిగా చిరుతపులిని చూసి భక్తులతోపాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఈ విషయాన్ని భక్తులు స్థానిక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. అయితే భక్తులతోపాటు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ, దేవస్థానం ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు గోడపై కూర్చున్న చిరుతపులిని స్థానికులు వీడియో తీసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది.

Also Read: Nara Lokesh: ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్ కీలకోపన్యాసం

Also Read: Deepavali 2024: దీపావళి వేళ.. జస్ట్ ఇలా చేయండి చాలు..

Also Read: Dhantrayodashi 2024: ధనత్రయోదశి రోజు ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది


ఇప్పటికే నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పెద్ద పులలు సంచరిస్తున్నాయి. ఆటవీ శాఖ అధికారులు వాహనంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. రహదారిపై పెద్ద పులి సంచరించింది. అందుకు సంబంధించిన వీడియోను అటవీ శాఖ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

Also Read: Visakhapatnam: ఇండిగో విమానాలు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు

Also Read: జగన్ చెల్లికి అన్యాయం చేయకు..! విజయమ్మ లేఖ..

Also Read: రతన్ టాటా అలా అడుగుతారని అసలు ఊహించ లేదు


మరోవైపు గత అర్థరాత్రి శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై చిరుత సంచరించింది. నాగర్ కర్నూల్ జిల్లా వటవర్లపల్లి వద్ద చిరుత రహదారి దాటుతూ కనిపించింది. ఒక్కసారిగా రహదారిపైకి చిరుత ప్రత్యక్షం కావడంతో.. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గరయ్యారు. వెంటనే తేరుకుని చిరుతపులిని ఫోటో తీశారు.

Also Read: CM Chandrababu: గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు

Also Read: అడిగిన దానికి సమాధానం చెప్పు.. పోలీస్ పై రఘునందన్ రావు ఫైర్

Also Read: వామ్మో.. సూర్య నమస్కారాలతో ఇన్ని లాభాలున్నాయా..?


అయితే శ్రీశైలం అటవీ ప్రాంతంలో రాత్రి వేళ ప్రయాణిస్తున్న వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వివాహలను చాలా నిదానంగా నడపాలని వారు సూచిస్తున్నారు. అలాగే అటవీ ప్రాంతంలో వాహనాలు ఆపి కిందకు దిగవద్దని వాహనదారులను అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. మరికొద్ది రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో శ్రీశైలానికి భక్తులు పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

For AndhraPradesh News And Telugu News...

Updated Date - Oct 29 , 2024 | 09:58 PM