ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతిస్తాం... మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 24 , 2024 | 04:11 PM

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయడును ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) కలిశారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యతపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని చంద్రబాబుకి మందకృష్ణ అంజేశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయడు(Chandrababu)ను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) కలిశారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యతపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని చంద్రబాబుకి మందకృష్ణ అంజేశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మాదిగల ఆకాంక్షలను చంద్రబాబు ముందు పెట్టామని.. తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక మొదటి ప్రాధాన్యతలో అవన్నీ నెరవేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. వర్గీకరణ విషయంలో సీఎం జగన్ మాదిగలను మోసం చేశారని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం కనీసం లాయర్‌ను కూడా పెట్టలేదని చెప్పారు. మాదిగల సంక్షేమాన్ని జగన్ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ఎన్డీఏ కూటమికి తాము మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

TTD: ధర్మారెడ్డిపై వైఎస్‌ జగన్‌కు ఎందుకింత ప్రేమ.. ఓహో అసలు సినిమా ఇదేనా..?

చంద్రబాబు ఆ హామీ ఇచ్చారు..

మాదిగలంతా నిద్రాహారాలు మాని కూటమి గెలుపు కోసం పనిచేస్తారని అన్నారు. ఈనెల 30వ తేదీన గుంటూరులో ఎన్నికల ప్రచార సరళిపై రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి ఇంటింటికీ కూటమి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. కేంద్రంలో మోదీపై ఏపీలో చంద్రబాబుపై తమకు నమ్మకం ఉందన్నారు. మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు.29 రిజర్వుడు సీట్లలో మాదిగలకు జగన్ కేవలం పది స్థానాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. టీడీపీ తరఫున మాదిగలకు 14 సీట్లు కేటాయించారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నానని.. ఆయన పోటీ చేసే రిజర్వుడు స్థానాలు మూడిట్లో ఒకటి మాదిగలకు ఇవ్వాలని కోరారు. గతంలో రాజ్యసభ స్థానం టీడీపీ నేత వర్ల రామయ్యకి చేజారిందని.. ఈసారి కచ్చితంగా ఆయనకి ఇవ్వాలని కోరారు. ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగల గెలుపుగా భావిస్తామని మందకృష్ణ మాదిగ అన్నారు.

ఇవి కూడా చదవండి

TDP: ప్రజాగళం షెడ్యూల్ విడుదల.. 4 రోజులపాటు పర్యటనలో బిజీ కానున్న చంద్రబాబు

Pawan Kalyan: చేనేత కార్మికుడి కుటుంబం ఆత్మహత్య పట్ల పలు అనుమానాలు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 04:24 PM

Advertising
Advertising